Movie News

తొమ్మిదేళ్లకు దక్కిన ‘మెగా’ అవకాశం

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కబోయే సినిమా షూటింగ్ ఈ నెల మూడో వారంలో ప్రారంభం కానుంది. పూజా కార్యక్రమాలు, ఓపెనింగ్ అయిపోయింది కాబట్టి నేరుగా సెట్స్ లోకి వెళ్ళిపోతారు. ఫైనల్ వెర్షన్ లాక్ చేసేసిన రావిపూడి క్యాస్టింగ్ ని దాదాపు కొలిక్కి తెచ్చేశాడు. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు మెయిన్ హీరోయిన్ నయనతారనే. అధికారికంగా ఇప్పుడప్పుడే ప్రకటన చేయకపోవచ్చు. భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినప్పటికీ పాత్ర ప్రాధాన్యం దృష్ట్యా నిర్మాణ సంస్థ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఇక రెండో కథానాయికగా క్యాథరిన్ త్రెస్సా ఓకే అయ్యింది.

అయితే ఇక్కడో చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోవాలి. చిరంజీవి సరసన నటించే అవకాశం క్యాథరిన్ కు 2017లోనే వచ్చింది. మెగా కంబ్యాక్  ఖైదీ నెంబర్ 150 కోసం వివి వినాయక్ తొలుత ఆమెనే అనుకున్నారు. కానీ సుష్మితతో వచ్చిన విబేధాల కారణంగా క్యాథరిన్ ని తప్పించి కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారనే ప్రచారం మీడియాలో జరిగింది. అయితే దీన్ని సమర్ధిస్తూ లేదా ఖండిస్తూ ఎవరూ ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదు. సో నిజమే అనుకున్నారందరూ. కట్ చేస్తే తొమ్మిది సంవత్సరాల తర్వాత క్యాథరిన్ తిరిగి ఛాన్స్ దక్కించుకోవడం విశేషమే. పేరుకి సెకండ్ హీరోయినే అయినా చిరుతో ఒకటి రెండు పాటలు ఉండొచ్చని అంటున్నారు.

కథకు సంబంధించి లీక్స్ లేకపోవడంతో అభిమానుల్లో ఇది ఎలాంటి కథ అయ్యుంటుందనే ఆసక్తి విపరీతంగా ఉంది. గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు స్థాయి వినోదాన్ని అనిల్ రావిపూడి పండించబోతున్నాడని ఇప్పటికే యూనిట్ సభ్యులు తెగ ఊరిస్తున్నారు. వెంకటేష్ ఉన్నది కన్ఫర్మ్ అయినా దాన్ని అఫీషియల్ చేయకుండా గుట్టుగా దాస్తున్నారు. అప్డేట్స్ ఒక క్రమపద్ధతిలో ప్రమోషన్ల రూపంలో రివీల్ చేయాలనుకుంటున్న రావిపూడికి ఏదో ఒక రూపంలో బయటికి వస్తున్న లీక్స్ తలనెప్పిగా మారాయి. 2026 సంక్రాంతి పండగ లక్ష్యంగా పక్కా ప్లానింగ్ తో షూట్ చేయబోతున్నారు.

This post was last modified on May 6, 2025 11:57 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

39 minutes ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

1 hour ago

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

2 hours ago

లోకేష్ కోసం వెళ్ళని చంద్రబాబు ఏపీ కోసం వచ్చారు

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

2 hours ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

3 hours ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

3 hours ago