కియారా అద్వానీ.. బాలీవుడ్, తెలుగు సినిమాల్లో ప్రముఖ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న విషయం తెలిసిందే. ఫగ్లీ సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు ఎమ్‌ఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ, కబీర్ సింగ్, గుడ్ న్యూస్ వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ గా తన రేంజ్ ను పెంచుకుంది. ఇక తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ సినిమాల్లో నటించింది.
కియారా నటనతో పాటు ఆమె అందం, స్టైల్‌తో అభిమానులను ఆకర్షిస్తుంది. మెట్ గాలా 2025లో కియారా తన బేబీ బంప్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె బంగారు రంగు టాప్, నలుపు గౌన్, తెల్లని క్లాత్‌తో అద్భుతంగా కనిపించింది. ఈ డ్రెస్‌ను గౌరవ్ గుప్తా డిజైన్ చేశారు. కియారా ఈ ఈవెంట్‌లో తన ప్రెగ్నెన్సీ గ్లోతో మరింత అందంగా కనిపించింది. ఆమె చేతుల్లో రింగ్స్, సింపుల్ నెక్లెస్ ఆమె లుక్‌ను హైలెట్ చేశాయి.
కియారా 2023లో సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి ప్రేమ శేర్‌షా సినిమా సెట్‌లో మొదలైంది. 2025 ఫిబ్రవరిలో వీరు తమ మొదటి బిడ్డను ఆశిస్తున్నట్లు ప్రకటించారు. ఇక కియారా ఇప్పటికే పలు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంది. వార్ 2 లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్‌తో కనిపించనుంది. అలాగే టాక్సిక్ అనే కన్నడ పాన్ ఇండియా సినిమాలో యష్‌తో నటిస్తోంది. మరి ఈ సినిమాలు అమ్మడికి ఏ స్థాయిలో విజయాలను అందిస్తాయో చూడాలి.
This post was last modified on May 6, 2025 9:35 am
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…