మే నెల వచ్చిందంటే నందమూరి అభిమానుల ఉత్సాహం మామూలుగా ఉండదు. లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆరే కాక ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టింది కూడా ఈ నెలలోనే. తారక్ ప్రతి పుట్టిన రోజుకూ అభిమానుల కోసం ఏదో ఒక కానుక ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటాడు. తన సినిమాలకు సంబంధించిన విశేషాలు బయటికి వస్తుంటాయి ఆ రోజే. ఈసారి తారక్ తన ఫ్యాన్స్ కోసం డబుల్ ట్రీట్ ఇవ్వబోతుండడం విశేషం.
ప్రస్తుతం తారక్ రెండు చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ మూవీ ‘వార్-2’ చిత్రీకరణ దాదాపుగా పూర్తి కాగా.. ప్రశాంత్ నీల్ మూవీ ఇటీవలే మొదలైంది. ఈ రెండు చిత్రాలూ మే 20న తారక్ పుట్టిన రోజుకు ట్రీట్స్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా గ్లింప్స్ రాబోతున్నట్లు ఇప్పటికే ఫైనల్ అయిపోయింది. టైటిల్‌తో ఒక పోస్టర్ రిలీజ్ చేయడంతో పాటు చిన్న వీడియో గ్లింప్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారట.
బాలీవుడ్లో ఇలా హీరోల పుట్టిన రోజుకు గ్లింప్స్ రిలీజ్ చేయడం తక్కువే కానీ.. తారక్ కోసం ‘వార్-2’ టీం ఆ పని చేయబోతోంది. మరి తారక్ ఫ్యాన్స్‌కు నచ్చేలా ఎలాంటి గ్లింప్స్ వదులుతారో చూడాలి. పాన్ ఇండియా స్థాయిలో రిలీజయ్యే రెండు ప్రెస్టీజియస్ మూవీస్‌కు సంబంధించి గ్లింప్స్ రాబోతుండడంతో మే 20న సోషల్ మీడియాలో తారక్ పేరు మార్మోగిపోవడం ఖాయం. హృతిక్ రోషన్ మరో హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న‘వార్-2’ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ప్రశాంత్ నీల్ సినిమా వచ్చే ఏడాది జూన్ 25న విడుదలవుతుందని ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.
This post was last modified on May 6, 2025 9:16 am
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…