గత కొన్నేళ్లలో భాషా భేదం లేకుండా దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శల పాలైన సినిమా అంటే ‘ఆదిపురుష్’ అనే చెప్పాలి. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో దీన్ని మించిన డిజాస్టర్లు చాలానే ఉన్నాయి కానీ.. ఇది హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ‘రామాయణం’ కథను దారుణంగా చెడగొట్టి పెట్టారనే భావన రావడం వల్ల ఈ సినిమాపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సామాన్య ప్రేక్షకుల సంగతి పక్కనపెడితే.. అనేక మంది సినీ ప్రముఖులే ఈ సినిమాను తప్పుబట్టారు. చిత్ర బృందంలోని వారు కూడా ఔట్ పుట్ విషయమై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఈ జాబితాలోకి సైఫ్ అలీఖాన్ కూడా వచ్చాడు.
తన కొడుకు తైమూర్‌కు ‘ఆదిపురుష్’ సినిమా చూపించానని.. అతడిలో ఏ స్పందనలూ లేకపోవడం చూసి తాను సారీ చెప్పానని సైఫ్ పేర్కొనడం చర్చనీయాంశం అయింది. ఆదిపురుష్ ఎంత డిజాస్టర్ అయినప్పటికీ.. తాను ముఖ్య పాత్ర పోషించిన సినిమా గురించి సైఫ్ ఇలాంటి కామెంట్ చేయడం ఆశ్చర్యపరిచింది. ఐతే ఈ కామెంట్లపై సైఫ్ ఇప్పుడు వివరణ ఇచ్చాడు.
ఆదిపురుష్ సినిమా బాలేదు కాబట్టి తన కొడుక్కి సారీ చెప్పలేదంటూ సైఫ్ యుటర్న్ తీసుకున్నాడు. తాను సారీ చెప్పింది వేరే విషయానికని వెల్లడించాడు. ‘‘నేను ఆదిపురుష్‌లో విలన్‌గా నటించాను. అందులో కేకలు వేస్తూ అందరిపై యుద్ధం చేస్తుంటాను. అది చూసి నా కొడుకు ఈసారి ఇలాంటి సినిమాలో హీరోగా చేయమని అడిగాడు. ఓకే చెప్పాను. ఇందులో విలన్‌గా చేసినందుకు సారీ చెప్పాను. నేను నటించిన అన్ని సినిమాలనూ గౌరవిస్తాను. ఆదిపురుష్‌ను కూడా అలాగే చూస్తాను. సినిమాలన్నింటికీ నా మద్దతు ఒకేలా ఉంటుంది’’ అని సైఫ్ పేర్కొన్నాడు. సైఫ్ ‘సారీ’ కామెంట్స్ తర్వాత నెటిజన్లు మరోసారి దర్శకుడు ఓం రౌత్‌ను టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలోనే సైఫ్ యుటర్న్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.
This post was last modified on May 5, 2025 4:07 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…