ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న ఒక వార్త ఫ్యాన్స్ లో పెద్ద చర్చకు దారి తీస్తోంది. వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందబోయే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని వేగంగా పూర్తి చేసి 2026 సంక్రాంతి బరిలో దింపాలని హారికా హాసిని ప్రొడ్యూసర్లు నిర్ణయించుకున్నట్టు దాని సారాంశం. ఇంకా షూటింగ్ మొదలుకాలేదు. అసలు అధికారిక ప్రకటనే రాలేదు. అయినా సరే ఇంత పెద్ద ఊహాగానం రావడం చిన్న విషయం కాదు. అసలు ఏడు నెలల్లో అనౌన్స్ మెంట్ నుంచి ఫస్ట్ కాపీ సిద్ధం చేయడం దాకా త్రివిక్రమ్ అంత వేగంగా డీల్ చేయగలరా అనేది పెద్ద ప్రశ్న. ఇక్కడ మిస్ చేయకూడని లాజిక్ మరొకటి ఉంది.
సంక్రాంతికే ఫిక్సయిన చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమాలో వెంకటేష్ ఒక ప్రత్యేక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అఫీషియల్ గా చెప్పలేదు కానీ విశ్వసనీయ సమాచారం మేరకు ఈ కాంబో ఉంది. ఏదో ఆషామాషీ గెస్టు కాకుండా ఎక్కువ సేపు ఉండే క్యారెక్టరట. ఇది నిజమయ్యే పక్షంలో వెంకటేష్ తన సినిమాతోనే తాను పోటీ పడేందుకు అస్సలు ఒప్పుకోడు. పైగా ముందు అనౌన్స్ చేసింది మెగా అనిల్ టీమ్. ఒకరు చెప్పాక ఇంకొకరు రాకూడదనే రూలేం లేదు కానీ ఒకే హీరో రెండు సినిమాలు అలా క్లాష్ అవ్వడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు. పైగా చిరు వెంకీ మొదటిసారి నటిస్తున్న టైంలో ఇలాంటివి ప్రోత్సహించరు.
సో వెంకీ త్రివిక్రమ్ రిలీజ్ ప్లాన్ గురించి జరుగుతున్న ప్రచారం ఊహాగానం తప్ప మరొకటి కాదు. అల్లు అర్హున్ 23 మొదలుపెట్టడానికి ఎక్కువ టైం పట్టేలా ఉండటంతో అప్పటిదాకా ఖాళీగా ఉండటం ఇష్టం లేని త్రివిక్రమ్ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న వెంకటేష్ సినిమాని ఇప్పుడు చేయాలనే దిశగా అడుగులు వేస్తున్నట్టు ఫిలిం నగర్ టాక్. ప్రస్తుతం వెంకటేష్ అందుబాటులో లేరు. రాగానే దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశముంది. ఒకవేళ నిజంగా కార్యరూపం దాల్చినా 2026 వేసవిని టార్గెట్ చేసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎప్పటి నుంచో ఏళ్ళ తరబడి అభిమానులు డిమాండ్ చేస్తున్న డ్రీం కాంబినేషన్ ఇది.
This post was last modified on May 5, 2025 10:39 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…