అమెరికాలో విడుదల కాబోయే విదేశీ సినిమాలకు ఇకపై వంద శాతం టారిఫ్ విధిస్తున్నట్టు ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ప్రకటించడం ఒక్కసారిగా ఇండస్ట్రీ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఉదాహరణకు ఇకపై అక్కడి డిస్ట్రిబ్యూటర్ మన సినిమాని కోటి రూపాయలకు కొంటే పన్ను రూపంలో అంతే మొత్తాన్ని యుఎస్ ప్రభుత్వానికి చెల్లించాలి. దీని వల్ల ఆ భారం నేరుగా ప్రేక్షకుడి మీద పడి టికెట్ ధరలు పెరుగుతాయి. 14 డాలర్లకే వసూళ్లు అంతంత మాత్రంగా వస్తున్న టైంలో ఇప్పుడీ సొమ్ముని రెట్టింపు చేస్తే తెలుగు ఎన్ఆర్ఐలు థియేటర్లకు రావడం తగ్గిపోతుంది. ఇది తీవ్రమైన పరిణామాలకు దారి తీయొచ్చు.
యుఎస్ లో ఎక్కువ బిజినెస్ చేసుకుంటున్నది తెలుగు, హిందీ, తమిళ సినిమాలే. కన్నడ, మలయాళంకు పరిమిత మార్కెట్ ఉంది. టాలీవుడ్ అయినా టయర్ 1, 2 స్టార్లకు ఉన్నంత ఆదరణ మధ్యస్థ హీరోలకు లేదు. కంటెంట్ బాగుందని టాక్ వస్తే తప్ప జనాలు కదలడం లేదు. ఒకవేళ ప్యాన్ ఇండియా మూవీకి డిజాస్టర్ టాక్ వస్తే మిలియన్ దాటడమే గగనం అయిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ వేసిన బాంబు డిస్ట్రిబ్యూషన్ వర్గాలను కుదేలు చేయడం ఖాయం. గత ఏడాది కాలంలో ఏడెనిమిది సినిమాలు మినహాయించి అమెరికాలో చాలా మటుకు పబ్లిసిటీ ఖర్చులు కూడా పూర్తి తేలేని డిజాస్టర్లు ఎన్నో ఉన్నాయి.
రాబోయే రోజుల్లో చాలా ప్యాన్ ఇండియా మూవీస్ క్యూలో ఉన్నాయి. హరిహర వీరమల్లు, కుబేర, కన్నప్ప, ది రాజా సాబ్, విశ్వంభర, స్వయంభు, మిరాయ్, వార్ 2, కూలి ఇలా చెప్పుకుంటూ పోతే 2025దే పెద్ద లిస్టు ఉంది. ఇవన్నీ ఓవర్సీస్ వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ లు పెరిగినా నిశ్చింతగా ఉన్నవి. ఇప్పుడీ వంద శాతం టారిఫ్ వల్ల అమ్మకాల్లో తేడాలు వస్తాయి. ఓటిటిలు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఇకపై 1 మిలియన్, 10 మిలియన్ అంటూ వేగంగా పడే పోస్టర్ల నెంబర్లకు బ్రేకులు పడొచ్చు. ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పూర్తి విధి విధానాలు ఇంకా వెలువడాల్సి ఉంది.
This post was last modified on May 5, 2025 9:56 am
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…