కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రెసిడెంట్ చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్న బాలకృష్ణకు పౌరసన్మాన సభ ఘనంగా జరిగింది. వేలాదిగా విచ్చేసిన అభిమానులు, నందమూరి కుటుంబసభ్యుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలయ్య ఫ్యాన్స్, ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చేలా బోలెడు కబుర్లు పంచుకున్నారు. ప్రపంచంలో 50 సంవత్సరాలు హీరోగా కొనసాగిన హీరో నేనొక్కడినేనంటూ కరతాళ ధ్వనుల మధ్య గర్వంగా చెప్పారు. పద్మభూషణ్ ఇచ్చారు సంతోషమే కానీ నాన్న ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇస్తే వాళ్లకు వాళ్ళు గౌరవం ఇచ్చుకున్నట్టు అవుతుందని విన్నవించారు.
ఇకపై సెకండ్ ఇన్నింగ్స్ ని మరింత బలంగా చూస్తారని, బ్యాక్ టు బ్యాక్ నాలుగు హిట్లు ఇచ్చాక ఇకపై అంచనాలకు మించి మరింత చెలరేగుతానని ఒకవైపే చూడంటూ సింహాలోని డైలాగు చెప్పడం ద్వారా కొత్త జోష్ ఇచ్చారు. నటులందరూ ఎమ్మెల్యే కాలేదని, ఎందరో వచ్చి నామరూపాలు లేకుండా పోయారని, సేవలు చేశా కాబట్టి జనం నన్ను గెలిపించారని రాజకీయ ప్రస్థానం గురించి వివరించారు. ఇప్పుడే కాదు ఇక ముందు తరాలలో కూడా తన అభిమానులు పుడుతూనే ఉంటారని చెప్పిన బాలయ్య మైకు గాల్లో ఎగరేసి పట్టుకోవడం గురించి చమత్కరించడం, దానికి ఎంత టెన్షన్ పడుతుంటానో వివరించడం ఆకట్టుకుంది.
సినిమా, రాజకీయాలు రెండింటి ప్రస్తావన తెస్తూ మాట్లాడిన బాలకృష్ణ అంచనాలకు మించి మంచి కిక్ అయితే ఇచ్చారు. ప్రస్తుతం అఖండ 2 చేస్తున్న బాలయ్య ఆ సినిమా దసరా పండక్కు రిలీజ్ చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి 2026 సంక్రాంతి వైపు చూస్తున్నారని ఆల్రెడీ టాక్ ఉంది. హీరో, ఎమ్మెల్యే, బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్, అన్ స్టాపబుల్ షో యాంకర్ ఇలా ఆరు పదుల వయసులోలోనూ బహుపాత్రలు పోషిస్తున్న బాలయ్యకు పద్మభూషణ్ తన ప్రతిభకు గవర్నమెంట్ ఇచ్చిన గౌరవం. ఇకపై మరింత దూకుడు చూపిస్తానంటున్న బాలయ్యని దర్శకుడిగా చూడాలనే ఫ్యాన్స్ కోరిక త్వరలోనే తీరొచ్చేమో.
This post was last modified on May 5, 2025 6:24 am
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…