తెలుగు ప్రేక్షకులకు కార్తీ అనగానే ఠక్కున గుర్తొచ్చే సినిమా ఖైదీ. అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయం సాధించి అక్కడి నుంచి టాలీవుడ్ లో తనకో మార్కెట్ సంపాదించి పెట్టింది. నా పేరు శివ, ఊపిరి లాంటి హిట్లు దాన్ని మరింత బలోపేతం చేశాయి. తర్వాత కొన్ని ఫ్లాపులు బిజినెస్ మీద ప్రభావం చూపించినా కార్తీకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ఇటీవలే విడుదలై సూపర్ హిట్ అందుకున్న హిట్ 3 తర్వాతి భాగంలో కార్తీ ఏసిపి రత్నవేల్ పాండియన్ / వీరప్పన్ గా నటించబోతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ కు ముందే న్యూస్ లీకైనా థియేటర్లో చూసినప్పుడు ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు.
అసలు విషయానికి వస్తే కార్తీ ఖైదీతో ఎంత దగ్గరైనా రాబోయే రోజుల్లో మూడుసార్లు ఖాకీ దుస్తుల్లోనే దర్శనం ఇవ్వబోతున్నాడు. వాటిలో మొదటిది వావా వతియర్. ఎప్పటి నుంచో షూటింగ్ లో ఉన్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు ఇంకా డబ్బింగ్ టైటిల్ నిర్ణయించలేదు. త్వరలోనే విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. తర్వాత సర్దార్ 2లో చేస్తున్న డ్యూయల్ రోల్ లో కొడుకు వేషం పోలీస్ ఆఫీసరన్న సంగతి తెలిసిందే. హిట్ 4 ది ఫోర్త్ కేస్ లో ఎలాగూ అసిస్టెంట్ కమీషనర్ అఫ్ పోలీస్ గా కనిపిస్తాడు. ఇంత వరసగా ఈ క్యారెక్టర్లు చేస్తున్న హీరో తెలుగు, తమిళంలో కార్తీ ఒక్కడే అన్నది చెప్పుకోదగ్గ విశేషం .
అయితే హిట్ 4కి చాలా టైం పడుతుంది. దర్శకుడు శైలేష్ కొలను ఇంకా కథను సిద్ధం చేయాలి. ప్రస్తుతానికి లైన్ మాత్రమే ఉంది. ఆలోగా వావా వతియర్, సర్దార్ 2 విడుదలైపోతాయి. లోకేష్ కనగరాజ్ నెక్స్ట్ ఖైదీ 2ని తెరకెక్కించబోతున్నాడు. ఇవన్నీ అయ్యాక హిట్ 4 ఉంటుంది. దీనికన్నా ముందు ఒక రొమాంటిక్ మూవీని వేరే హీరోతో చేసే ఆలోచనలో ఉన్నాడు శైలేష్. ఇవన్నీ ఎలా ఉన్నా ఖాకీలో కరుడుగట్టిన బీహార్ బందిపోట్లను పట్టుకునే క్యారెక్టరే కార్తీ కెరీర్ బెస్ట్ పోలీసని చెప్పొచ్చు. హిట్ 4 తమిళ వెర్షన్ లో పెట్టిన పేరు రత్నవేల్ పాండియన్. ఇది విక్రమార్కుడు కోలీవుడ్ రీమేక్ సిరుతైలో కార్తీకి పెట్టిన పేరు. బాగుంది కదూ.
This post was last modified on May 4, 2025 2:45 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…