పూజా హెగ్డే.. ఒక దశలో టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్‌గా ఉన్న భామ. తమిళంలో కూడా ఆమెకు మంచి క్రేజే వచ్చింది. సౌత్‌లో పూజా కెరీర్ ఫ్లాపులతో మొదలైనప్పటికీ.. తర్వాత తన దశ తిరిగింది. తెలుగులో ‘మాస్క్’ అనే సినిమాతో ఆమె సౌత్‌లో అడుగు పెట్టింది. అది పెద్ద ఫ్లాప్. తెలుగులో తన అరంగేట్ర చిత్రం ‘ముకుంద’, కూడా సరిగా ఆడలేదు. ‘ఒక లైలా కోసం’ కూడా ఏదో ఒక మోస్తరుగా ఆడింది. తర్వాత ఆమె సౌత్ సినిమాల నుంచి బ్రేక్ తీసుకుని వెళ్లి హిందీలో ‘మొహెంజదారో’ చేసింది. అది ఇంకా పెద్ద డిజాస్టర్. అయినా సరే పూజాకు ఢోకా లేకపోయింది. ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రంతో కుర్రాళ్ల మతులు పోగొట్టి ఇక్కడ వరుసగా అవకాశాలు అందుకుంది. అల వైకుంఠపురంలో సినిమాతో ఒక రేంజ్ కి వెళ్ళి చేరుకుంది ఈ బుట్టబొమ్మ.
చూస్తుండగానే టాప్ హీరోయిన్ అయిపోయింది. ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్.. ఇలా పెద్ద పెద్ద స్టార్లతో సినిమాలు చేసింది. ఇక ఆమెకు తిరుగులేదనే అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా.. తర్వాత ఆమె కెరీర్ గాడి తప్పింది. వరుస ఫ్లాపులు ఎలాంటి ఆర్టిస్టునైనా వెనక్కి లాగేస్తాయని పూజా కెరీర్‌ను చూస్తే అర్థమవుతుంది. ‘రాధేశ్యామ్’తో మొదలైన పూజా ఫ్లాప్ స్ట్రీక్ ఎంతకీ ఆగట్లేదు. తెలుగు, తమిళం, హిందీ.. అని తేడా లేదు. అన్ని చోట్లా ఆమెను ఫ్లాపులు, డిజాస్టర్లే పలకరిస్తున్నాయి. తమిళంలో విజయ్ లాంటి టాప్ స్టార్‌తో చేసిన ‘బీస్ట్’ డిజాస్టర్ అయింది. తర్వాత తెలుగులో చేసిన ‘ఆచార్య’ గురించి చెప్పాల్సిన పనే లేదు. తర్వాత బాలీవుడ్‌కు వెళ్లి సర్కస్, కిసీ కా భాయ్ కిసి కి జాన్, దేవా చిత్రాల్లో నటించింది. ఈ మూడు సినిమాలూ నిరాశపరిచాయి. దీంతో ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేసింది పూజా.
ఆల్రెడీ ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. కెరీర్లో బాగా గ్యాప్ వచ్చేసింది. ఇలాంటి టైంలో తన కెరీర్‌ను మలుపు తిప్పే సినిమా అవుతుందని ‘రెట్రో’ మీద చాలా ఆశలే పెట్టుకుంది. కానీ ఈ సినిమా కూడా ఆమె రాత మార్చేలా లేదు. తమిళ జనాలు తొలి రోజు ఆహా ఓహో అంటూ సినిమా గురించి ఎలివేషన్లు వేశారు. కానీ రెండో రోజు వసూళ్లు పడిపోయాయి. పాజిటివ్ టాక్ కాస్తా మిక్స్డ్ టాక్‌గా మారింది. తెలుగులో అయితే తొలి రోజే ఈ చిత్రం డిజాస్టర్ అని కన్ఫమ్ అయిపోయింది. ఓవరాల్‌గా చివరికి ‘రెట్రో’ ఫ్లాప్‌గానే నిలిచేలా కనిపిస్తోంది. వరుసగా ఏడో ఫెయిల్యూర్‌ను ఖాతాలో వేసుకోబోతున్న పూజా.. ఇక పుంజుకోవడం కష్టమే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చాలా కాలం తరువాత మళ్ళీ తెలుగులో ఒక లవ్ స్టోరీ తో అడుగు పెట్టనుంది. తనకి సక్సెస్ పరిచయం చేసిన తెలుగు సినిమానే మళ్ళీ తనకు మంచి విజయాన్ని ఇస్తుందేమో చూడాలి.
This post was last modified on May 3, 2025 3:23 pm
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…