బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ విషయంలో ఏదైనా కొంత అసంతృప్తి కలిగించిన అంశం ఉందంటే అది విలన్ ప్రతీక్ బబ్బర్ దే. నిజానికి శైలేష్ తనదైన బాణీలో క్రైమ్ థ్రిల్లర్లను ప్రెజెంట్ చేస్తున్నాడు కానీ అసలైన ప్రతినాయకుడికి సంబంధించిన బ్యాక్ డ్రాప్ మాత్రం ఇంటెన్స్ గా లేకపోవడం కొంత ప్రభావాన్ని తగ్గిస్తోంది. ఈ సమస్య ఇప్పటిది కాదు. వెంకటేష్ సైంధవ్ లో అదే పనిగా బాలీవుడ్ నుంచి నవాజుద్దీన్ సిద్ధిక్ ని తీసుకొస్తే పెద్ద ఇంపాక్ట్ అనిపించలేదు. అసలు కంటెంట్ వీక్ గా ఉండటం పక్కనపెడితే అలాంటి టెర్రిఫిక్ యాక్టర్ నుంచి ప్రేక్షకులు చాలా పెద్ద ఎత్తున ఆశిస్తారు. కానీ అది నెరవేరలేదు.
హిట్ 2 ది సెకండ్ కేస్ లో సుహాస్ మీద నడిపించిన ట్విస్టు షాకింగ్ గా అనిపించినా ఇంకాస్త బలమైన లేయర్లు పడి ఉండాల్సిందనేది విశ్లేషకుల మాట. హిట్ 1 ది ఫస్ట్ కేస్ క్లైమాక్స్ లో చూపించిన మలుపు ఊహించనిదే అయినా అక్కడ లేడీ విలన్ తాలూకు థ్రెడ్ అంత సాలిడ్ సబ్జెక్టుకి సూట్ కాలేదనే చిన్న కంప్లయింట్ విమర్శకుల నుంచి వచ్చింది. సరే సక్సెసయ్యాయి కాబట్టి ఇది ప్రస్తావించాల్సిన టాపిక్ కాదనొచ్చు. కానీ ఒకవేళ ఈ సినిమాలు అన్నింటిలో విలన్ మరింత బలంగా ఉండి, పవర్ ఫుల్ ఆర్టిస్టులు తోడైతే నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళేదనే కామెంట్స్ ని కొట్టి పారేయలేం. సో ఇది జాగ్రత్త పడాల్సిన పాయింట్.
కార్తీతో హిట్ 4 ది ఫోర్త్ కేస్ కన్నా ముందు శైలేష్ కొలను వేరే సినిమా చేయబోతున్నాడు. నాగార్జునకు ఒక లైన్ చెప్పాడనే టాక్ ఉంది కానీ ఫైనల్ వెర్షన్ ఇద్దరికీ సంతృప్తిగా అనిపిస్తే పట్టాలు ఎక్కే అవకాశం లేకపోలేదు. వరసగా హిట్ సిరీస్ లు చేసుకుంటూ పోవడం కరెక్ట్ కాదు కాబట్టి మధ్యలో జానర్ మార్చాలి. శైలేష్ అదేపనిలో ఉన్నాడు. ఎలివేషన్లే ట్రెండ్ గా మారిపోయిన జమానాలో హీరోతో పాటు విలన్ కు కూడా అంతే ప్రాధాన్యం ఉండేలా చూపిస్తేనే మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతోంది. మరి శైలేష్ నెక్స్ట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో చూడాలి. ఇప్పటిదాకా సీరియస్ సబ్జెక్టులే టచ్ చేసి తర్వాతా ఇదే బాటే కొనసాగించేలా ఉన్నాడు.
This post was last modified on May 3, 2025 8:17 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…