Movie News

ట్రెడిషనల్ టచ్ లో పిచ్చెక్కిస్తున్న ఇస్మార్ట్ పాప

సౌత్ ఇండస్ట్రీలో మాస్ గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న బ్యూటీ నభా నటేష్. కర్ణాటక నుంచి వచ్చిన ఈ బ్యూటీ 2015లో కన్నడ సినిమా “వజ్రకాయ”తో యాక్టింగ్ లోకి అడుగుపెట్టింది. తెలుగులో “నన్ను దోచుకుందువటే” సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అదుగో డబుల్ ఇస్మార్ట్, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, మాస్ట్రో” వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నభా నటనతో పాటు ఆమె అందం, గ్లామర్‌తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో టచ్‌లో ఉంటుంది. నభా నటేష్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫోటోలు చూస్తే ఆమె గ్లామరస్ లుక్స్ కు ఫిదా అవ్వాల్సిందే. ఎరుపు రంగు లెహంగా చోళీలో ఆమె చాలా అందంగా కనిపిస్తుంది. ఆ ఎరుపు దుపట్టా, బంగారు నగలు ఆమె అందానికి మరింత ఒప్పుగా ఉన్నాయి. ఆ డ్రెస్ పై బంగారు బార్డర్, చిన్న చిన్న డిజైన్లు ఆమె లుక్‌ను మరింత స్పెషల్‌గా చేశాయి. నభా స్టైల్‌లో ఎప్పుడూ ఒక ట్రెడిషనల్ టచ్ ఉంటుంది.

ఆమె లెహంగాలో కూర్చున్న ఫోటోలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. అలాగే బంగారు నగలు, చేతుల్లో బంగారు గాజులు చాలా అందంగా ఉన్నాయి. నభా ఎప్పుడూ తన డ్రెస్సింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆమె సింపుల్‌గా ఉంటూనే గ్లామరస్‌గా కనిపిస్తుంది. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

This post was last modified on May 2, 2025 1:20 pm

Page: 1 2 3

Share

Recent Posts

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

3 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

5 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

10 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

11 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

11 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

11 hours ago