హిట్టు ఫ్లాపు కాసేపు పక్కనపెడితే సూర్య మీద అభిమానులకే కాదు సగటు జనాల్లోనూ చక్కని అభిప్రాయం ఉంది. సినిమాల పరంగానే కాకుండా బయట చూపించే ప్రవర్తన, అగరం ఫౌండేషన్ ద్వారా పిల్లల చదువులు, సామజిక కార్యక్రమాలు ఎన్నో తనకు మంచి బ్రాండ్ తీసుకొచ్చాయి. అయితే గత కొన్నేళ్లుగా డిజాస్టర్ల పర్వంలో మునిగి తేలుతున్న సూర్యకు బ్లాక్ బస్టర్ రావాలని ప్రతి మూవీ లవర్ కోరుకున్నాడు. కంగువ కోసం ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే. విలువైన సమయం వృథా అవుతున్నా సరే ఒళ్ళు హూనం చేసుకుని దాని కోసం చాలా త్యాగం చేశాడు. దర్శకుడు సిరుతై శివని నమ్మితే కంగువ దారుణంగా పోయింది.
తాజాగా రెట్రో వచ్చింది. సూర్య మళ్ళీ డైరెక్టర్ నే నమ్మాడు. కార్తీక్ సుబ్బరాజ్ ఇచ్చిన నెరేషన్ కన్నా అతని మేకింగ్ స్టైల్ మీద కాన్ఫిడెన్స్ తో ఎస్ చెప్పాడు. చాలా వేగంగా షూటింగ్ చేస్తుంటే సంతోష పడ్డాడు. కట్ చేస్తే రెట్రోకి నిన్న వచ్చిన టాక్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. బాషా, యుగానికి ఒక్కడు, దళపతి ఇలా పాత హిట్లన్నీ మిక్సీలో వేసి కొట్టి తనదైన ల్యాగ్ స్క్రీన్ ప్లేతో కథనాన్ని నడిపించిన కార్తీక్ సుబ్బరాజ్ చివరి దాకా థియేటర్లో కూర్చుకోవడం కష్టమనించేలా చేశాడు. జయరాం, జీజు జార్జ్, నాజర్ లాంటి సీనియర్ మోస్ట్ క్యాస్టింగ్ ఉన్నా వాళ్ళను కనీస స్థాయిలో వాడుకోలేకపోవడం క్షమించరాని తప్పు.
ఓవర్ రేటెడ్ డైరెక్టరని పేరున్న కార్తీక్ సుబ్బరాజ్ దాన్ని సార్థకం చేసుకోవడం కోసమే రెట్రో తీశాడేమో అనిపిస్తోంది. సూర్య ఈ ఫలితాన్ని ఎలా జీర్ణించుకుంటాడో కానీ ఫ్యాన్స్ మాత్రం తెగ ఫీలవుతున్నారు. నెక్స్ట్ ఆర్ జె బాలాజీ తీస్తున్న సూర్య 45 ముగింపుకు దగ్గరలో ఉంది. దీని మీద ఆశల సంగతేమో కానీ అభిమానుల ఎదురు చూపులు మన వెంకీ అట్లూరి మీద ఉన్నాయి. లక్కీ భాస్కర్, సార్ లాంటి సబ్జెక్టులు సూర్యకు పడితే చెలరేగిపోతాడు. దానికి తగ్గట్టే వెంకీ అట్లూరి మంచి వింటేజ్ డ్రామా రాసుకున్నాడట. ఈ రెండు సినిమాలు క్లిక్ అయితే సూర్య బ్యాక్ టు ట్రాక్ అనొచ్చు. తగ్గిపోతున్న మార్కెట్ ని తిరిగి నిలబెట్టుకోవచ్చు.
This post was last modified on May 2, 2025 12:45 pm
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…