వచ్చిన దాని ఒరిజినల్ వెర్షన్ రైడ్ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్. అజయ్ దేవగన్ హీరోగా వచ్చిన ఈ మనీ థ్రిల్లర్ మంచి విజయం సాధించింది. అప్పటి నుంచే దాని సీక్వెల్ కోసం ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఆ కోరిక తీర్చేశారు. నిన్న ప్రపంచవ్యాప్తంగా రైడ్ 2 భారీ ఎత్తున రిలీజయ్యింది. మొదటి భాగంలో భార్యగా నటించిన ఇలియానా స్థానంలో వాణి కపూర్ వచ్చి చేరింది. బుక్ మై షోలో హిట్ 3 ది థర్డ్ కేస్, తుడరుమ్, రెట్రోలకు ధీటుగా మొదటి రోజు రెండు లక్షలకు పైగా టికెట్లు అమ్మిన రైడ్ 2 కంటెంట్ పరంగా ప్రేక్షకులను పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేకపోయింది.
కథ ఇంచు మించు మొదటి భాగం లాగే ఉంటుంది. కాకపోతే విలన్ మారాడు, కొన్ని అదనపు ట్విస్టులు జోడించారు. ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ అమెయ్ పట్నాయక్ (అజయ్ దేవగన్) ఉద్దేశపూర్వకంగా లంచం తీసుకుని ట్రాన్స్ఫర్ చేయించుకుని రైల్వే మినిస్టర్ దాదా భాయ్ (రితీష్ దేశముఖ్) ప్రాతినిధ్యం వహిస్తున్న నగరానికి వస్తాడు. ప్రజాసేవ ముసుగులో అతను చేస్తున్న స్కాములు, దొంగ సొమ్ము బయటికి తీయాలనేది అమేయ్ లక్ష్యం. ఉన్నధికారులు వద్దంటున్నా రైడ్ చేస్తాడు. కానీ ఏం దొరక్క సస్పెండ్ అవుతాడు. ఇక్కడి నుంచి అసలు స్టోరీ మొదలవుతుంది. దాదాని చట్టం ముందు ఎలా దోషిగా నిలబెట్టాడనేది అసలు స్టోరీ.
పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా చూస్తే రైడ్ 2 తీవ్రంగా నిరాశపరచదు. టైం పాస్ అయిపోతుంది. మరీ మొదటి భాగంని మించి ఉంటుందని ఆశిస్తే మాత్రం భంగపాటు తప్పదు. రితీష్ దేశముఖ్ పెర్ఫార్మన్స్, అమిత్ త్రివేది బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రెండు మూడు మలుపులు రైడ్ 2 కింద పడిపోకుండా కాపాడాయి. అవసరం లేని మూడు పాటలు కేవలం రెండు గంటల నిడివిని దాటించాలనే తాపత్రయం తప్ప వాటి వల్ల ఏ మాత్రం ఉపయోగం కలగలేదు. ఏడేళ్ల తర్వాత సీక్వెల్ తీయాలనే ఆలోచన మంచిదే కానీ కంటెంట్ అంతకు మించి ఉంటే రైడ్ 2 బెస్ట్ ఎక్స్ పీరియన్స్ అయ్యేది. రొటీన్ ఉన్నా చూస్తామనుకుంటే ట్రై చేయొచ్చు.
This post was last modified on May 2, 2025 11:43 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…