Movie News

చీప్ థియేటర్లు – షారుఖ్ సూపర్ ఐడియా

జనాలు థియేటర్లకు రావడాన్ని తగ్గించడం వెనుక కారణం క్వాలిటీ కంటెంట్ లేకపోవడమే కావొచ్చు కానీ అంతకన్నా సీరియస్ గా చూడాల్సిన సమస్య మరొకటి ఉంది. అదే టికెట్ రేట్లు, స్నాక్స్ ధరలు. గత కొన్నేళ్లుగా థియేటర్ ఎక్స్ పీరియన్స్ చాలా ఖరీదుగా మారిపోయింది. ముఖ్యంగా మల్టీప్లెక్సులు వచ్చాక వీటి వ్యయం తట్టుకోలేక మధ్య తరగతి జనాలు ఓటిటి, పైరసీకి అలవాటు పడ్డారు. ఇది బాలీవుడ్ వ్యాపారాన్ని తీవ్రంగా పట్టి పీడిస్తోంది. అందుకే అప్పుడప్పుడు 99 రూపాయల టికెట్లు, వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఇస్తూ ఉంటారు. అయినా సరే పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. దీనికి షారుఖ్ ఖాన్ ఒక సూపర్ ఐడియా ఇచ్చాడు.

తాజాగా జరుగుతున్న వేవ్స్ సమ్మిట్ 2025లో అతిథిగా పాల్గొన్న షారుఖ్ ఖాన్ ఒక ప్రతిపాదన తెచ్చాడు. ప్రతి ఊరిలో చీప్ థియేటర్లు ఉండాలని, వాటిలో భాషతో సంబంధం లేకుండా భారతీయ చిత్రాలు ప్రదర్శించాలని, టికెట్ రేట్లు అందుబాటులో ఉండేలా చూసుకుంటే ఫుట్ ఫాల్స్ పెరుగుతాయని వివరించాడు. షారుఖ్ అన్నదాంట్లో లాజిక్ ఉంది. సగటున 200 నుంచి 500 రూపాయల మధ్యలో మల్టీప్లెక్స్ టికెట్ రేట్లు ఉంటున్నాయి. పుష్ప, ఆర్ఆర్ఆర్, కల్కి లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ అయితే ఓకే కానీ మార్కెట్ తక్కువగా ఉండే కొందరు టయర్ 2 హీరోలకు సైతం ఈ పద్ధతినే ఫాలో అవుతున్నారు నిర్మాతలు.

దీని వల్ల కామన్ మ్యాన్ దూరమైపోయాడు. ఒకవేళ షారుఖ్ అన్నట్టు వంద లోపే టికెట్లు అమ్మేలా సాధారణ వసతులు ఉన్న సింగల్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తే హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా ఎక్కువ జనాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఐడియా అయితే చెప్పాడు కానీ మోనోపోలీ రాజ్యమేలే ఇండస్ట్రీలో ఇదంత సులభంగా అమలు చేయలేరు. పెట్టుబడి మొత్తం వారం పది రోజుల్లో వచ్చేయాలని కంకణం కట్టుకుంటున్న నిర్మాతలు ఈ చీప్ థియేటర్స్ కాన్సెప్ట్ ని అంత సులభంగా అంగీకరించరు. కనీసం ఆలోచన చేసి మంచి చెడ్డా విశ్లేషించుకుంటే భవిష్యత్తులో అయినా ఇలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది.

This post was last modified on May 1, 2025 8:52 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

డేంజర్ జోన్లో జపాన్‌.. 2 లక్షల మందికి ముప్పు?

జపాన్ దేశాన్ని ఇప్పుడు ఓ భయంకరమైన వార్త వణికిస్తోంది. అధికారులు అరుదైన "మెగాక్వేక్ అడ్వైజరీ" జారీ చేయడంతో అక్కడి ప్రజలు…

32 minutes ago

జ‌గ‌న్‌ నిర్ణ‌యానికి చెక్‌, వారికి చంద్ర‌బాబు చ‌ల్ల‌ని క‌బురు!

గ‌త రెండు మూడేళ్ల నుంచి ఎదురు చూస్తున్న వేలాది మందికి సీఎం చంద్ర‌బాబు తాజాగా చ‌ల్ల‌ని క‌బురు అందించారు. త‌మ…

1 hour ago

లంచం తీసుకున్నాడని ఉరిశిక్ష వేసిన ప్రభుత్వం

చైనాలో అవినీతికి పాల్పడితే శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో మరోసారి రుజువైంది. భారీగా లంచం తీసుకున్న బై తియాన్‌హుయి అనే…

4 hours ago

మన దేశం పౌరసత్వం కోసం అతను చేసింది త్యాగమే

విదేశాలకు వెళ్లిన చాలామంది అక్కడి సిటిజన్‌షిప్ కోసం ఆరాటపడుతుంటారు. గ్రీన్ కార్డు కోసమో, పాస్‌పోర్ట్ కోసమో ఏళ్ల తరబడి ఎదురుచూస్తారు.…

5 hours ago

అవతార్ నిప్పులను తక్కువంచనా వేయొద్దు

ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన సినిమాల లిస్టు తీస్తే ఖచ్చితంగా టాప్ త్రీలో ఉండే మూవీ అవతార్. మూడో భాగం…

7 hours ago

మురారి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే

ఫస్ట్ విడుదల కావాల్సిన బైకర్ హఠాత్తుగా వెనక్కు తగ్గడంతో శర్వానంద్ మరో సినిమా నారీనారీ నడుమ మురారి ముందుకు వచ్చేసింది.…

7 hours ago