Movie News

పూజాహెగ్డేని ఇలా చూపొద్దన్న ఫ్యాన్స్

బుట్టబొమ్మ అని రామజోగయ్య శాస్త్రి గారు రాసినట్టు ఆ పదానికి న్యాయం చేకూర్చే అందంతో పూజా హెగ్డే కొన్నేళ్ల క్రితం వరకు వరస బ్లాక్ బస్టర్లతో బాగానే దూసుకెళ్లింది. ఆ తర్వాత ఫ్లాపులు ఒకదాని తర్వాత మరొకటి పలకరించడంతో అవకాశాలు తగ్గిపోయాయి. అయితే సూర్య రెట్రోలో ఛాన్స్ రావడం చూసి ఫ్యాన్స్ జాక్ పాట్ అనుకున్నారు. అందులోనూ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం అంటే పెర్ఫార్మన్స్ కి ఎంతో స్కోప్ ఉంటుంది. అయితే మేకప్ లేకుండా డార్క్ టోన్ లోకి మార్చి ఆమెను నల్లగా చూపించే ప్రయత్నం బెడిసి కొట్టిందని చెప్పాలి. ఏ మాత్రం నప్పని డీ గ్లామర్ వేషంలో పూజా నటన ఏమో కానీ లుక్స్ అయితే వద్దు ప్లీజ్ అనిపించాయి.

నిజానికి కార్తీక్ సుబ్బరాజ్ డిజైన్ చేసుకున్న రుక్మిణి క్యారెక్టర్ కు పూజా హెగ్డేలాంటి తెల్లతోలు భామలు సూటవ్వరు. తమిళంలోనే తుషార విజయన్, ఐశ్వర్య రాజేష్ లాంటి వాళ్ళను తీసుకుంటే సహజత్వం పెరిగి సూర్యతో కెమిస్ట్రీ మరింత బాగా పండేది. పూజా తన శాయశక్తులా నిలబెట్టే ప్రయత్నం చేసింది. భారీ ఎమోషనల్ సీన్స్ లో సూర్యతో పోటీ పడింది. కానీ చాలా చోట్ల కృతకంగా అనిపించడం ఆమె తప్పు కాదు. అలా చూపించాలనుకున్న కార్తీక్ సుబ్బురాజ్ ది. ఇది కనక బ్లాక్ బస్టర్ అయితే మళ్ళీ బిజీ అయిపోవచ్చని భావిస్తున్న పూజా హెగ్డేకు తమిళంలో ఏమో కానీ తెలుగులో ఆ కోరిక తీరడం కష్టమే అనిపిస్తోంది.

ఇక కంటెంట్ విషయానికి వస్తే భార్య కోసం పాత గ్యాంగ్ స్టర్ జీవితాన్ని వదిలేయాలనుకున్న ఒక యువకుడి జీవితంలో చెలరేగిన అలజడులనే కార్తీక్ సుబ్బురాజ్ రెట్రోలో రాసుకున్నాడు. అతన్ని చిన్నప్పటి నుంచి మార్చే రుక్మిణిగా పూజా హెగ్డే కనిపిస్తుంది. జిగర్ తండా డబుల్ ఎక్సే తెలుగులో ఆడలేదు. మరి టాక్ పరంగా అభిమానులను టెన్షన్ పెడుతున్న రెట్రో ఏదైనా మేజిక్ చేయడం అనుమానమే. మొదట్లో వచ్చే పదిహేను నిమిషాల సింగల్ షాట్ కల్యాణ మండపం ఎపిసోడ్ తప్ప కార్తీక్ సుబ్బురాజ్ పెద్దగా మెప్పించింది లేదు. సూర్యకే కాదు పూజా హెగ్డేకు కూడా సక్సెస్ ఇంకా అందని ద్రాక్షే అవుతుందేమో.

This post was last modified on May 2, 2025 7:17 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

1 hour ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

2 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

4 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

4 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

5 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

6 hours ago