Movie News

ఆమె కన్నుకొడితే… రిషి సాబ్ ట్వీట్ వేశాడు

ప్రియా ప్రకాశ్ వారియర్… ఒకే ఒక్క వీడియోతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్, ఫాలోయింగ్ తెచ్చుకుందీ చిన్నది. ‘ఓరు ఆదార్ లవ్’ మూవీ టీజర్‌లో ప్రియా వారియర్ కన్ను కొట్టి, చేతితో ముద్దుల గన్ పేల్చిన స్టైల్‌కి యువతరం ఫిదా అయిపోయింది. అప్పట్లో ఈ వీడియో ఎంతటి సంచలనం క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ వెటరన్ యాక్టర్ రిషి కపూర్ కూడా ఈ వీడియో చూసి ప్రియా వారియర్‌కు పడిపోయారు..

‘ఈ పిల్ల నా టైమ్‌లో ఎందుకు పుట్టలేదబ్బా’ అంటూ రిషి సాబ్ వేసిన ట్వీట్‌పై, అప్పట్లో బీటౌన్‌లో పెద్ద డిస్కర్షనే జరిగింది. రిషి కపూర్ ఆకస్మిక మరణంతో ఆయన ట్వీట్‌ను మరోసారి గుర్తుచేసుకుంది ప్రియా వారియర్.

2018, ఫిబ్రవరి 16న రిషి కపూర్ చేసిన ట్వీట్‌ను పోస్ట్ చేసిన ప్రియా వారియర్… ‘ఈ వ్యాఖ్యలు నాకెంతో విలువైనవి. నాపై నాకు నమ్మకం పోయినప్పుడు నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. నా జీవితంలో ఎప్పటికీ ఆయన మాటలు మరిచిపోలేను. మీ టైమ్‌లో నేను పుట్టి, మరోసారి మిమ్మల్ని కలిసే అవకాశం రావాలని కోరుకుంటున్నా…’ అంటూ రిషి కపూర్‌కి ఘనమైన నివాళి అర్పించింది ప్రియా ప్రకాశ్ వారియర్.

ఇదిలా ఉంటే టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేయడంతో భారీ అంచనాలతో విడుదలైన ‘ఓరు ఆదార్ లవ్’… బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలై ఏడాదిన్నర కావస్తున్నా ప్రియా వారియర్ మరో మూవీ కమిట్ కాలేదు.

కమిట్ అయిన సినిమాలు రిలీజవ్వలేదు. అందుకే ‘ఓరు ఆదార్ లవ్’ తర్వాత తనను అందరూ మరిచిపోవడంతో రిషి కపూర్ ట్వీట్‌ను వాడుకుని, అటెన్షన్ పొందాలని ప్రయత్నిస్తోందంటూ ప్రియా వారియర్‌ను కామెంట్స్ చేస్తున్నారు కొందరు నెటిజన్స్.

This post was last modified on April 30, 2020 4:21 pm

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

9 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

9 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

10 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

10 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

12 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

13 hours ago