రేపు విడుదల కాబోతున్న రెండు పెద్ద సినిమాల మధ్య పోటీని హీరోల పరంగా కాకుండా దర్శకుల కోణం నుంచి చూస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు అర్థమవుతాయి. అవేంటో విశ్లేషించుకుంటే హిట్ 3కే బజ్ ఎందుకు ఎక్కువగా ఉందనేది అర్థమవుతుంది. రెట్రో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కు ఇంటెలిజెంట్ ఫిలిం మేకర్ గా పేరుంది. క్లిష్టంగా అనిపించే స్క్రీన్ ప్లేతో ఒక్కోసారి అర్థం కాని కథలను తెరకెక్కించి ఆడియన్స్ తిరస్కారానికి గురవుతుంటాడు. జగమే తంతిరం, మెర్క్యూరీ దానికి మంచి ఉదాహరణలు. మహాన్ ఓటిటిలో వచ్చింది కాబట్టి దాని థియేటర్ పొటెన్షియాలిటీని అంచనా వేయలేం కానీ అదీ గొప్ప క్లాసిక్ కాదు.
మిగిలిన వాటిలో రజనీకాంత్ స్టైల్ అండ్ ఇమేజ్ ఇమేజ్ వల్ల పేట గట్టెక్కగా నవరస వెబ్ సిరీస్ లో తీసిన సింగల్ ఎపిసోడ్ కు సైతం ఏమంత గొప్ప ప్రశంసలు రాలేదు. కార్తీక్ సుబ్బరాజ్ పదమూడు సంవత్సరాల కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు రెండే ఒకటి జిగర్ తండా, రెండు ఇరైవి. తమిళంలో మాత్రమే బాగా ఆడాయి. ఇక గత చిత్రం జిగర్ తండా డబుల్ ఎక్స్ తెలుగుతో సహా అన్ని డబ్బింగుల్లో డిజాస్టరే. కోలీవుడ్ లో మాత్రమే డబ్బులు తెచ్చింది. సో రెట్రోకు ఎక్కువగా పని చేస్తోంది సూర్య ఇమేజే. లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్, ప్రశాంత్ నీల్ లాగా కార్తీక్ సుబ్బరాజ్ కు కమర్షియల్ ఫుల్ లేదనేది వాస్తవం.
ఇక శైలేష్ కొలను విషయానికి వస్తే తీసింది మూడు సినిమాలు. వాటిలో సైంధవ్ ఒకటే ఫ్లాప్. హిట్ ది ఫస్ట్ కేస్, హిట్ ది సెకండ్ కేస్ రెండూ హిట్టే. వసూళ్లపరంగా నిర్మాత నానికి బాగా పే చేశాయి. హిట్ 1 మక్కికి మక్కి హిందీ రీమేక్ కౌంట్ లోకి తీసుకోలేం. ఇప్పుడు హిట్ 3 ది థర్డ్ కేస్ ని శైలేష్ కొలను రూపొందించిన విధానం అంచనాలు పెంచేసింది. ట్రైలర్ కట్ కొంచెం హడావిడిగా అనిపించినా నాని కటవుట్ సహాయంతో శైలేష్ స్టైలిష్ హింసతో హైప్ పెంచేశాడు. తమిళం, హిందీలోనూ బుకింగ్స్ పాజిటివ్ గా ఉండటం గమనార్హం. ఎలా చూసినా కార్తీక్ సుబ్బరాజ్ సీనియర్ ఇంటెలిజెన్స్ ని కేవలం ఐదేళ్ళ అనుభవమున్న శైలేష్ వయొలెన్స్ డామినేట్ చేసేస్తోంది.
This post was last modified on April 30, 2025 5:55 pm
ఎవరు ఔనన్నా కాదన్నా అఖండ తాండవం 2 బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న వైనం స్పష్టం. కొన్ని ఏరియాల్లో డీసెంట్ గా…
నిన్న జరిగిన రాజా సాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ తర్వాత హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడు. మెగాస్టార్ చిరంజీవి బ్రేక్ తీసుకున్నాక నంబర్ వన్ స్థానం…
కెరీర్లో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘ విరామం తీసుకున్న మంచు మనోజ్.. ఈ ఏడాదే రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.…
ఒకప్పుడు మలయాళ ఫిలిం ఇండస్ట్రీ టాప్ హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు దిలీప్. మోహన్ లాల్, మమ్ముట్టిల తర్వాత…
‘పవన్ కల్యాణ్ డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చారు. స్ట్రగుల్ అవుతున్నారు. అయినా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు…