సమంత నిర్మాతగా మారి శుభం అనే చిన్న సినిమా తీసింది. మే 9 రిలీజ్. అందరూ కొత్తోళ్లే. దర్శకుడు ప్రవీణ్ ఇంతకు ముందు నెట్ ఫ్లిక్స్ కోసం సినిమా బండి తీస్తే మంచి పేరు తీసుకొచ్చింది. శుభం ట్రైలర్ చూశాక జనం కాసింత నవ్వుకున్నారు కానీ ఖచ్చితంగా థియేటర్లకు వెళ్లాలనే రేంజ్ లో ఆసక్తి పెంచలేకపోయిన మాట వాస్తవం. ముందు సస్పెన్స్ గా పెడదామనుకున్న సమంత క్యామియోని ఇందులోనే రివీల్ చేశారు. కారణం బిజినెస్ యాంగిల్. ఎంత సామ్ ప్రొడ్యూసర్ అయినా కేవలం కొత్త మొహాల మీద బిజినెస్ జరగడం కష్టం. అందులోనూ హిట్ 3 వచ్చిన ఎనిమిది రోజులకు థియేటర్లకు రావడమంటే రిస్క్ ఉంటుంది.
సరే బజ్ సంగతి ఎలా ఉన్నా శుభం కోసం అగ్ర డిస్ట్రిబ్యూషన్ సంస్థలు తలో చేయి వేస్తున్నాయి. నైజాం పంపిణి బాధ్యతను మైత్రి తీసుకోగా ఏసి సీడెడ్ కోసం సురేష్ బాబు ముందుకొచ్చారు. ఫలితంగా శుభంకు చెప్పుకోదగ్గ థియేటర్లు దక్కుతాయి. రిలీజ్ ఛార్ట్ లో మంచి స్క్రీన్లు కనిపిస్తాయి. దీని ద్వారా ప్రేక్షకుల్లో అటెన్షన్ తెచ్చే ప్రయత్నాలు పెంచుకోవచ్చు. ఒకరకంగా సామ్ కు ఇదంతా బలమైన సపోర్ట్ కానుంది. పాజిటివ్ టాక్ వస్తే వీటి మద్దతు మరింత బలమై రెండో వారంలో థియేటర్లు హోల్డ్ చేసుకోవడానికి ఉపయోపడుతుంది. తద్వారా బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాలు అందుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
కాకపోతే శుభంకి పోటీ పరంగా రిస్క్ లేకుండా అయితే ఉంది. శ్రీవిష్ణు సింగిల్ మీద బజ్ పెరుగుతోంది. ట్రైలర్ వచ్చాక యూత్ దృష్టి దాని వైపు వెళ్ళింది. జగదేకవీరుడు అతిలోకసుందరిని భారీ ఎత్తున 2డి, 3డి లో రీ రిలీజ్ చేస్తున్నారు. వైజయంతి సంస్థ కాబట్టి వీళ్ళ ప్లానింగ్ ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. సో శుభంకు సూపర్ హిట్ టాక్ వస్తేనే వీటిని తట్టుకుంటుంది. పైగా ప్రమోషన్లకు ఎక్కువ సమయం లేదు. కళ్లుమూసి తెరిచే లోపు ఎనిమిది రోజుల అయిపోతాయి. నిర్మాతగా తొలి ప్రయత్నం కాబట్టి సమంతా బోలెడు ఆశలు పెట్టుకుంది. థియేటర్ ఎలా ఉన్నా ఓటిటి, డిజిటల్, డబ్బింగ్ హక్కులు మంచి రేట్ కే వెళ్లాయట.
This post was last modified on April 30, 2025 4:48 pm
పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…
నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…
రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…