నటీమణులలో ఈమధ్య పెద్దగా సక్సెస్ లు రాకపోయినా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ అందుకున్న వారిలో ఇశ్వర్యా మేనన్ ఒకరు. నటనతో పాటు తన అందచందాలతోనూ ఆకట్టుకుంటున్న ఈ భామ తాజాగా చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుపు రంగు దుస్తుల్లో ఆమె ఇచ్చిన పొజులు అభిమానుల మనసులను కొల్లగొడుతున్నాయి.
ఒకవైపు సొగసైన చూపులు.. మరోవైపు మినిమల్ మేకప్‌తో ఆమె ఇచ్చిన అభినయ హావభావాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. క్లాస్ అందాన్ని చాటేలా ఆమె స్టైలింగ్, హెయిర్‌డిజైన్ ప్రతి ఫోటోలో ప్రత్యేకంగా కనిపిస్తోంది. వీటిని చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. క్యూట్ హీరోయిన్ సొగసుల ఐశ్వర్యం అంటూ పాజిటివ్ గా స్పందిస్తున్నారు.
ఇశ్వర్యా మేనన్ 2012లో తమిళ చిత్రంతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత తెలుగులో ‘స్పై’ సినిమాలో ‘వైష్ణవి’ అనే పాత్రలో కనిపించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆమె నటించిన ఇతర లాంగ్వేజ్ చిత్రాల్లో కొన్ని సినిమాలు బాగానే గుర్తింపు తెచ్చాయి. తెలుగులో ‘భజే వాయు వేగం’ అనే సినిమా ఒక హ్యాపీ రిజల్ట్ ఇచ్చింది.
తన సినీ ప్రస్థానంలో వేగంగా పైకి రావాలన్న తొందరకు బదులుగా, ఏ పాత్ర చేసినా గుర్తుండిపోయేలా చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది ఇశ్వర్యా. అందంతో పాటు అభినయ ప్రతిభను సమపాళ్లలో కొనసాగిస్తూ, అందం అంటే కేవలం మెరుగైన రూపమే కాకుండా, వ్యక్తిత్వంలోనూ ప్రతిబింబించాలని నిరూపిస్తోంది. ఇప్పటికే ఆమె ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతుండగా, ఇలాంటి ఫోటోషూట్లు ఆమెకు మరిన్ని అవకాశాలు తెస్తాయని చెప్పవచ్చు. మరి నెక్స్ట్ అమ్మడికి ఎలాంటి అవకాశాలు అందుతాయో చూడాలి.
This post was last modified on April 30, 2025 2:38 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…