Movie News

హిట్ 3 టికెట్ హైక్స్ వచ్చేశాయ్

ఆంధ్రప్రదేశ్ లో ఎదురుచూసే కొద్దీ ఆలస్యమవుతున్న హిట్ 3 అడ్వాన్స్ బుకింగ్స్ కి రూటు క్లియరయ్యింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల జిఓ ఇష్యూలో జాప్యం జరగడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. మంచి ఓపెనింగ్స్ మీద ఇలాంటి పరిణామాలు ప్రభావం చూపిస్తాయి కాబట్టి వీలైనంత త్వరగా పరిష్కారం కావాలని ఎదురు చూశారు. ఏదైతేనేం ఉత్తర్వులు వెలువడ్డాయి. వారం రోజుల పాటు సింగల్ స్క్రీన్ లో 50, మల్టీప్లెక్సులో 75 రూపాయల చొప్పున ప్రతి టికెట్ మీద అదనంగా పెంచుకునేలా అనుమతులు వచ్చాయి. అయితే ఆర్డర్లో స్పెషల్ షో లేదా రాత్రి ప్రీమియర్లకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు కాబట్టి అవి ఉండకపోవచ్చు.

ఈ హైక్స్ మే 7 వరకు అమలులో ఉంటాయి. నానికి ఇంత భారీ పెంపు రావడం ఇదే మొదటిసారి. కూటమి ప్రభుత్వం రాకముందు సరిపోదా శనివారం, హాయ్ నాన్న, దసరా రిలీజయ్యాయి కాబట్టి అవి సాధారణ రేట్లతోనే బ్లాక్ బస్టర్లు సాధించాయి. ఇప్పుడు హిట్ 3కి పెంపు తీసుకోవడం ద్వారా నానికి ప్రయోజనం, రిస్క్ రెండూ ఉన్నాయి. చాలా బాగుందనే మాట వస్తే చాలు థియేటర్లు వారం రోజులు ధరతో సంబంధం లేకుండా నిక్షేపంగా నిండుతాయి. కాకపోతే ఫ్యామిలి ఆడియెన్స్ దూరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి యూత్, మాస్ తోనే వీలైనంత ఎక్కువ కలెక్షన్లు కొల్లగొట్టాల్సి ఉంటుంది.

నాని కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఆందోళన అక్కర్లేదనే అనిపిస్తోంది. బుకింగ్స్ ట్రెండ్ అదే సూచిస్తోంది. ఏపీలో టికెట్లు పెడుతున్న ఒక్కొక్క సెంటర్లో ఫాస్ట్ ఫిల్లింగ్ కనిపిస్తోంది. తెలంగాణ కన్నా ముందు ఏపీలో ఉదయం 7 గంటలకే షోలు ప్రారంభం కాబోతున్నాయి. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చారు. క్యామియోలు, యాక్షన్ ఎపిసోడ్లులో ఊహించని సర్ప్రైజులు చాలా ఉంటాయని టీమ్ ఊరిస్తోంది. నెల రోజులగా డ్రైగా ఉన్న టాలీవుడ్ బాక్సాఫీస్ కు హిట్ 3 ఎలాంటి జోష్ ఇవ్వబోతోందో ఇంకో ఇరవై నాలుగు గంటల్లో తేలిపోనుంది. 

This post was last modified on April 30, 2025 12:47 pm

Share

Recent Posts

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

2 hours ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

2 hours ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

2 hours ago

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

6 hours ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

6 hours ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

7 hours ago