స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, యాక్టర్ టర్న్డ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కలిసి గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్‌బస్టర్ అందించారు. అలాంటి దర్శక నిర్మాతలు మళ్లీ కలిసి పని చేయకపోవడం.. పైగా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆ మధ్య ‘గబ్బర్ సింగ్’ 8వ వార్షికోత్సవం సందర్భంగా ఇద్దరి మధ్య సాగిన మాటల యుద్ధం సాగింది. ఆ సందర్భంగా పెట్టిన హరీష్ పెట్టిన థ్యాంక్స్ నోట్లో బండ్ల పేరు ప్రస్తావించకపోవడం.. తర్వాత ఓ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ గురించి మాట్లాడుతూ అతను రీమేక్‌లతో తప్ప హిట్లు కొట్టలేడని బండ్ల కామెంట్ చేయడం తెలిసిన సంగతే. ఆపై ఇద్దరి మధ్య ట్విట్టర్లో ‘కోట్స్’ వార్ కూడా జరిగింది.
కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత బండ్ల స్వరం మారింది. హరీష్ శంకర్ గురించి మళ్లీ పాజిటివ్ కామెంట్స్ చేశాడు. అతడితో తనకేం గొడవ అన్నట్లు మాట్లాడాడు. మళ్లీ సినిమా చేస్తానని కూడా అన్నాడు. ఇప్పుడు బండ్ల మరోసారి హరీష్‌ను దువ్వుతూ ఒక ట్వీట్ చేయడం విశేషం. సమయం సందర్భం లేకుండా అతను ఉన్నట్లుండి హరీష్‌ను పొగుడుతూ ట్వీట్ వేశాడు. హరీష్ టాలీవుడ్లో ఉత్తమ దర్శకుడని పొగిడేస్తూ తాను తప్పు చేసి ఉంటే పట్టించుకోవద్దని అతడికి విన్నవించిన బండ్ల.. హరీష్.. తనతో ఎన్నో ఎన్నెన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు చేయాలనుకుంటున్నట్లుగా చెప్పాడు.
దీనికి హరీష్ శంకర్ బదులిస్తూ.. అంత మాట అనొద్దని, నువ్వు నా పెద్దన్నయ్య లాంటి వాడివని.. సినిమా మనందరికంటే పెద్దదని, సినిమాలు తీయడం ద్వారా మనం ఉన్నత జీవితాన్ని సాగిద్దామని అన్నాడు. బండ్లను బ్లాక్‌బస్టర్ ప్రొడ్యూసర్ అని కూడా సంబోధించాడు. కొన్నేళ్ల విరామం తర్వాత మళ్లీ నిర్మాతగా సినిమాలు చేయాలని చూస్తున్న బండ్ల.. పవన్ కళ్యాణ్‌తో సినిమా ఓకే అయినట్లు చెప్పిన సంగతి తెలిసిందే. కానీ అది నిజంగా కార్యరూపం దాలుస్తుందో లేదో తెలియడం లేదు. ఇలాంటి టైంలో హరీష్‌ను పొగుడుతూ ట్వీట్ వేయడంలో ఆంతర్యమేంటో బండ్లనే చెప్పాలి.
This post was last modified on November 4, 2020 5:55 pm
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…