Movie News

అవి బూతులు కాదు.. సంస్కృతం – శ్రీ విష్ణు

గ‌త కొన్నేళ్ల‌లో యూత్‌లో బాగా ఫాలోయింగ్ సంపాదించిన టాలీవుడ్ యువ న‌టుల్లో శ్రీ విష్ణు ఒక‌డు. స‌ర‌దాగా సాగే త‌న సినిమాలు, క్యారెక్ట‌ర్లు యువ‌త‌కు బాగా క‌నెక్ట్ అవుతున్నాయి. ఐతే చిలిపిగా, అగ్రెసివ్‌గా ఉండే క్యారెక్ట‌ర్ల‌లో సులువుగా ఒదిగిపోతున్న శ్రీ విష్ణు.. సంద‌ట్లో స‌డేమియా అన్న‌ట్లు ఆ పాత్ర‌ల్లో డ‌బుల్ మీనింగ్, బూతు డైలాగులను చిత్ర‌మైన స్ట‌యిల్లో వ‌ల్లిస్తుండ‌డం సామాజిక మాధ్య‌మాల్లో చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌తో పాటు స్వాగ్ మూవీలో శ్రీ విష్ణు డైలాగుల మీద చాలా చ‌ర్చ జ‌రిగింది. ఈ సినిమాలు ఓటీటీలో రిలీజ‌య్యాక త‌న డైలాగుల్లో మ‌ర్మాన్ని నెటిజ‌న్లు అర్థం చేసుకున్నారు. చాలా స్పీడుగా డైలాగులు చెబుతూ.. బూతులు అర్తం కాని విధంగా మాట్లాడ్డంలో శ్రీ విష్ణు సిద్ధ‌హ‌స్తుడ‌నే పేరొచ్చింది.

త‌న కొత్త చిత్రం సింగిల్‌లోనూ ఈ ఛాయ‌లు ఉన్నాయ‌ని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మైంది. ఈ నేప‌థ్యంలో ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మంలో విలేక‌రులు శ్రీ విష్ణు చెప్పే డబుల్ మీనింగ్ డైలాగుల గురించి ప్ర‌స్తావించారు. దీనికి శ్రి విష్ణు త‌న‌దైన శైలిలో స‌మాధానం ఇచ్చాడు. త‌న సినిమాల్లో డ‌బుల్ మీనింగ్ డైలాగులేమీ ఉండ‌వ‌ని అత‌న‌న్నాడు. తాను మాట్లాడేది సంస్కృత‌మ‌ని.. అది అర్థం కాక జ‌నం డ‌బుల్ మీనింగ్ అనుకుంటున్నార‌ని శ్రీ విష్ణు అన్నాడు.

తాను ఇప్పుడు సంస్కృతం నేర్ప‌లేన‌ని విలేక‌రిని ఉద్దేశించి శ్రీ విష్ణు స‌ర‌దాగా వ్యాఖ్యానించాడు. తాను చెప్పే డైలాగులు సాధార‌ణ వేగంలో చూస్తే అర్థం కావ‌ని.. ఓటీటీలో స్పీడు త‌గ్గించి చూస్తే అర్థ‌మ‌వుతాయ‌ని శ్రీ విష్ణు అన్నాడు. సింగిల్ మూవీలో క‌థానాయిక‌గా న‌టించిన కేతిక శ‌ర్మ‌.. దీని కంటే ముందు రాబిన్ హుడ్ మూవీలో చేసిన స్పెష‌ల్ సాంగ్‌లో స్టెప్స్ వివాదాస్ప‌దం అయ్యాయి క‌దా, మ‌రి మీ చిత్రంలో అలాంటి డ్యాన్స్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగితే.. అలాంటి వాటికి ఈ చిత్రంలో ఆస్కారం లేద‌ని శ్రీవిష్ణు తెలిపాడు. ఈ ఈవెంట్‌కు శ్రీ విష్ణు పంచెతో రావ‌డంపై మ‌రో హీరోయిన్ ఇవానా ప్ర‌శ్నించ‌గా.. వేస‌వి క‌దా, గాలాడుతుంద‌ని ఈ డ్రెస్‌లో వ‌చ్చిన‌ట్లు చ‌మ‌త్క‌రించాడు శ్రీ విష్ణు.

This post was last modified on April 29, 2025 9:54 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

2 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

2 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

3 hours ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

5 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

7 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

7 hours ago