ఓటిటి ట్రెండులో రీమేకులు తీసేటప్పుడు దర్శక నిర్మాతలు ఒకటికి పదిసార్లు తప్పక ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే పక్క భాషలో ఎంత హిట్టయినా సరే టాక్ తెలిసిన ప్రేక్షకులు వెంటనే డిజిటల్ లో చూసేస్తున్న తరుణంలో వాళ్ళను మళ్ళీ రీమేక్ తో మెప్పించడం పెద్ద సవాల్ గా మారింది. వీటికి సక్సెస్ రేట్ చాలా తక్కువ. అయినా సరే బాలీవుడ్ లో ఈ ధోరణి మారడం లేదు. గత మూడు నాలుగేళ్ళలో రీమేకులుగా వచ్చిన సినిమాలు చాలా మటుకు డిజాస్టర్లయ్యాయి. సైతాన్, దృశ్యం 2 లాంటి ఒకటి రెండు మినహాయించి అల వైకుంఠపురములోతో సహా అన్ని బాక్సాఫీస్ దగ్గర టపా కట్టినవే.
అసలు విషయానికి వస్తే సన్నీడియోల్ హీరోగా హిందీలో ‘సూర్య’ అనే మూవీ రూపొందుతోంది. ఇది మలయాళంలో ఏడేళ్ల క్రితం 2018లో వచ్చిన ‘జోసెఫ్’కు పునఃనిర్మాణం. మాజీ భార్య ఒక యాక్సిడెంట్ లో చనిపోతే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ దాని వెనుక కారణాలు వెతుకుతూ పెద్ద మెడికల్ మాఫియాని బయటికి తీస్తాడు. ప్రపంచానికి నిజాలు తెలియాలనే ఉద్దేశంతో ఎవరూ చేయని సాహసానికి పూనుకుంటాడు. అదే క్లైమాక్స్ లో షాకింగ్ గా ఉంటుంది. దీన్నే తెలుగులో రాజశేఖర్ తో ‘శేఖర్’గా తీశారు. జీవిత దర్శకత్వం వహించారు. అసలు వచ్చిన సంగతే గుర్తు లేనంతగా పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఇప్పటికీ ఓటిటి వెర్షన్ రిలీజ్ కాలేదు.
గదర్ 2, జాట్ లాంటి కమర్షియల్ సినిమాలతో మంచి ఊపు మీదున్న సన్నీ డియోల్ ఇప్పుడీ సూర్య చేయడం విచిత్రమే. ఒరిజినల్ వెర్షన్ తీసిన ఎం పద్మకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. బడ్జెట్ తక్కువ, వేగంగా తీసే అవకాశం, పరిమిత లొకేషన్లతో చుట్టేసి ఎక్కువ రేట్లకు అమ్మేసే ఛాన్స్ ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ కు ఉంటుంది. అరుపులు కేకలు లాంటివి సూర్య స్టోరీలో ఉండవు. మరి మాస్ ఫ్యాన్స్ దీన్ని ఎలా రిసీవ్ చేసుంటారో చూడాలి. ఆ మధ్య ఇలాగే మరో మల్లువుడ్ మూవీ ‘ముంబై పోలీస్’ని దేవాగా షాహిద్ కపూర్ హిందీలో రీమేక్ చేస్తే థియేటర్, ఓటిటి రెండింట్లోనూ డిజాస్టరయ్యింది. మరి సూర్య ఏం చేస్తాడో చూడాలి.
This post was last modified on April 28, 2025 6:30 pm
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…