ఏ ఏడాదిలోనూ మళ్ళీ ఇలాంటి నెల రాకూడదని బయ్యర్లు, నిర్మాతలు కోరుకుంటున్నారు. ఏప్రిల్ అంతగా పీడకలలు మిగిల్చింది. మార్చిలో మ్యాడ్ స్క్వేర్, కోర్ట్ లాంటి విజయాలు ఇచ్చిన ఆనందం ఈ ముప్పై రోజులు పూర్తిగా ఆవిరి చేశాయి. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కొత్త రిలీజులు ఉదయం ఆటకు కనీసం పట్టుమని పాతిక మంది రాలేని దయనీయ దృశ్యాలు చాలా థియేటర్లలో కనిపిస్తున్నాయి. మల్టీప్లెక్సుల్లో షోలు క్యాన్సిల్ చేయడం మాములు విషయమైపోయింది. ఒక్క ఎబోవ్ యావరేజ్ వచ్చినా కొంత ఊరట దక్కేదేమో కానీ పర్వాలేదని టాక్ తెచ్చుకున్నవి సైతం వసూళ్లలో ఫ్లాప్ గా మిగిలిపోవడం ట్రాజెడీ.
ఏప్రిల్ రెండో వారంలో వచ్చిన సిద్దు జొన్నలగడ్డ ‘జాక్’ ఉదయం ఆటకే చేతులెత్తేయగా తమిళంలో రికార్డులు సాధించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’కు టాలీవుడ్ లో పరాభవం తప్పలేదు. సన్నీ డియోల్ ‘జాట్’ డబ్బింగ్ చేయలేదు కాబట్టి సరిపోయింది లేదంటే ఈ లిస్టులో ఇంకొకటి తోడయ్యేది. యాంకర్ ప్రదీప్ హంగామా చేసిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’కి కొంచెం కూడా పనవ్వలేదు. కళ్యాణ్ గొప్పగా చెప్పుకున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ఫ్యాన్స్ ని సైతం నిరాశ పరిచింది. విడుదలకు ముందే బ్రేక్ ఈవెన్ అని ప్రచారం చేసుకున్న ‘ఓదెల 2’ నిర్మాతకేమో కానీ కమర్షియల్ లెక్కల్లో డబ్బులు పోసి డిస్ట్రిబ్యూటర్లకు మిగిలింది ఏం లేదు.
మొన్న వచ్చిన ‘సారంగపాణి జాతకం’కు డీసెంట్ రివ్యూలొచ్చాయి. పబ్లిక్ టాక్ ఓకే అనిపించింది. కానీ కలెక్షన్లలో అది ప్రతిబింబించడం లేదు. కంటెంట్ ప్రచారం చేసుకున్నంత గొప్పగా లేకపోవడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. యూత్ పుణ్యమాని ఉన్నంతలో ‘జింఖానా’ వసూళ్లు బాగానే రాబడుతున్నా బిసి సెంటర్లలో చెప్పుకోదగ్గ జోరు లేదు. మళయాలం టైటిల్ యధాతథంగా పెట్టుకున్న ‘తుడరుమ్’ పబ్లిసిటీ లోపంతో మంచి టాక్ ని ఉపయోగించుకొలేకపోతోంది. సంపూర్ణేష్ బాబు ‘సోదరా’తో పాటు త్రినాధరావు నిర్మించిన ‘చౌర్య పాఠం’ చేతులు ఎత్తేశాయి. ఇప్పుడు అందరి ఆశలు మేలో బోణీ చేయబోతున్న ‘హిట్ 3 ది థర్డ్ కేస్’ మీదే ఉన్నాయి. థియేటర్లను నింపే మహత్తర బాధ్యతను భుజాన వేసుకున్న నాని హిట్టు గ్యారెంటీ అంటున్నాడు.
This post was last modified on April 28, 2025 11:48 am
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…