టాలీవుడ్ క్రైమ్ జానర్ లో తనదైన ముద్ర చూపించిన దర్శకుడు శైలేష్ కొలను. హిట్ 1 తక్కువ బడ్జెట్ తో విజయం సాధించి, హిట్ 2 కి అడివి శేష్ లాంటి క్రేజీ హీరో తోడై, ఇప్పుడు హిట్ 3కి ఏకంగా నానినే హీరోగా మారే దాకా దీని రేంజ్ అంతకంతా పెరుగుతూ పోయింది. శైలేష్ సినిమాటిక్ యునివర్స్ పేరుతో త్వరలోనే వీళ్లందరినీ కలిపేలా అవెంజర్స్ తరహా మూవీ ప్లానింగ్ లో ఉన్నాడు శైలేష్ కొలను. అయితే దీనికి చాలా టైం పడుతుంది కాబట్టి ఈలోగా వేరే ప్రాజెక్టుని ఓకే చేసుకునే పనిలో పడ్డాడు. ప్రస్తుతం నాని, శ్రీనిధి శెట్టి ప్రమోషన్లలో బిజీగా ఉండగా శైలేష్ హిట్ 3 చివరి దశ పనులు, ఫైనల్ కరెక్షన్లలో మునిగి తేలుతున్నాడు.
ఇదిలా ఉండగా నాగార్జునకు శైలేష్ కొలను ఒక స్టోరీ చెప్పినట్టు లేటెస్ట్ అప్డేట్. ఇంకా అధికారికంగా తెలియలేదు కానీ ఒక రౌండ్ చర్చలైతే జరిగాయట. కుబేర, కూలి క్యామియోల తర్వాత నాగార్జున ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తమిళ దర్శకులతో అనుకున్న ఒకటి రెండు ప్యాన్ ఇండియా మూవీస్ ని పెండింగ్ లో ఉంచారు. అయితే శైలేష్ చెప్పిన స్టోరీ లైన్ బాగా నచ్చడంతో ఫుల్ వెర్షన్ డెవలప్ చేసుకుని రమ్మని అడిగారట. సీనియర్ స్టార్లను హ్యాండిల్ చేయడంలో తడబడిన శైలేష్ కొలను వెంకటేష్ కు సైంధవ్ రూపంలో ఫ్లాప్ ఇచ్చాడు. అందుకే ఈ టాలెంటెడ్ డాక్టర్ కి హిట్ 3 సక్సెస్ చాలా కీలకం.
హిట్ 3 ఫలితం కూడా నాగ్ కాంబో కార్యరూపం దాల్చడానికి దోహదం చేయొచ్చు. నా సామిరంగా తర్వాత నాగార్జున దర్శనం జరగలేదు. ఈ ఏడాది రెండుసార్లు కనిపించబోతున్నప్పటికీ అవి స్పెషల్ రోల్స్ కావడంతో సోలోగా నాగ్ ని చూడాలని అభిమనులు ఎదురు చూస్తున్నారు. శైలేష్ ఆయనకు చెప్పిన కథ క్రైమ్ జానరేనట. బీహార్ లో సంచలనం సృష్టించిన ఒక హత్య చుట్టూ పవర్ ఫుల్ స్టోరీ రాసుకున్నారని తెలిసింది. కేవలం ఇన్వెస్టిగేషన్ కోణంలోనే కాకుండా పొలిటికల్, సోషల్ ఇష్యూస్ ని టచ్ చేయబోతున్నారని తెలిసింది. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేదాకా నిర్ధారణగా చెప్పలేం కాబట్టి లెట్ వెయిట్ అండ్ సీ.
This post was last modified on April 27, 2025 6:31 pm
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఏ మాత్రం తగ్గకపోవడానికీ, తరచూ మళ్లీ మళ్లీ ఘర్షణలు చెలరేగడానికీ, అంతర్జాతీయ శక్తుల ఆడంబర నీతులు…
వైసీపీ హయాంలో పదవులు దక్కించుకున్న వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నాడు నెలకు 3 లక్షలకు పైగానే వేతనాల రూపంలో…
నితిన్ కెరీర్లో చాలా కీలకమైన సినిమా.. తమ్ముడు. ‘భీష్మ’ తర్వాత నితిన్‌కు ఓ మోస్తరు హిట్ కూడా లేదు. చెక్,…
జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. కొన్ని రోజుల కిందటే మళ్లీ ‘పవర్ స్టార్’గా మారారు. రాజకీయ నేతగా, మంత్రిగా…
ప్రస్తుతం వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా, దేవర 2లకు కమిట్ మెంట్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత…
ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలవడం…