ఛత్రపతి హిందీ రీమేక్ కోసం బోలెడు సమయాన్ని ముంబైలో వృథా చేసుకుని వచ్చిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రాగానే వరసబెట్టి సినిమాలు చేయడం చూస్తున్నాం. ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు భారీ చిత్రాలు టైటిల్స్ తో సహా సిద్ధమయ్యే దిశగా వెళ్లడం ఫ్యాన్స్ కి ఆనందం కలిగిస్తోంది. కానీ దేనికీ విడుదల తేదీలు ఖరారు కాకపోవడం ఆందోళన కలిగించే విషయం. ముందుగా ‘భైరవం’ సంగతి చూస్తే డిసెంబర్ నుంచి వాయిదాల పర్వంలోనే ఉంది. ఇప్పుడైనా కొత్త డేట్ చెబుతారా అంటే ఆ సూచనలు కనిపించడం లేదు. కన్నప్పకు పోటీగా దింపాలని మంచు మనోజ్ ఒత్తిడి చేస్తున్న టాక్ ఫిలిం నగర్ వర్గాల్లో ఉంది.
ఏళ్ళ తరబడి నిర్మాణంలో ఉన్న ‘టైసన్ నాయుడు’ ఇంకా అడ్డంకులు ఎదురుకుంటూనే ఉంది. టీజర్ వచ్చి ఏడాది దాటింది. ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. ఇప్పుడు ప్రొడక్షన్ లో ఉన్న ‘కిష్కిందపురి’ ఫస్ట్ లుక్ వచ్చేసింది. అంతకు ముందే ‘హైందవ’ అనౌన్స్ మెంట్ టీజర్ ని వదిలారు. ఇప్పుడీ నాలుగింట్లో రెండు ఫాంటసీ టచ్ ఉన్న ప్యాన్ ఇండియా మూవీస్ కావడం గమనార్హం. ఒక్క సినిమా సెట్ మీద పెట్టడానికే మీడియం రేంజ్ హీరోలు సైతం కిందా మీద పడుతున్న తరుణంలో సాయి శ్రీనివాస్ ఇంత స్పీడ్ గా ఉండటం మెచ్చుకోవాల్సిన విషయమే. కాకపోతే రిలీజ్ ప్లానింగ్ తేడా కొట్టడం గమనించుకోవాలి.
ముందైతే భైరవం, టైసన్ నాయుడుల వ్యవహారం తేల్చాలి. ప్రేక్షకులకు కనెక్టివిటీ క్రమం తప్పకుండా ఉండాలంటే రెగ్యులర్ గా సినిమాలు వస్తూ ఉండాలి. సాయి శ్రీనివాస్ కు మాస్ లో మార్కెట్ ఉంది కానీ మరీ టయర్ 2 స్థాయిలో అయితే కాదు. ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ ఇంకా తన కెరీర్ లో పడలేదు. రాక్షసుడు ఆడినా కానీ అది పూర్తిగా కంటెంట్ మీద ఆధారపడింది. హీరో పరంగా ఇమేజ్, నటన రెండూ పెద్దగా దోహదపడింది కాదు. తమ్ముడు బెల్లంకొండ గణేష్ సైతం మొదటి రెండు అడుగులు ఫ్లాపులు చూసి మూడోది నెమ్మదిగా వేస్తున్నాడు. వీలైనంత త్వరగా సాయి శ్రీనివాస్ ఏదో ఒక సినిమాతో థియేటర్లకు వచ్చేయాలి.
This post was last modified on April 27, 2025 3:00 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…