ఇంకా హరిహర వీరమల్లు సంగతే తేలలేదు కానీ ఓజి డిస్కషన్లు మళ్ళీ మొదలయ్యాయి. సెప్టెంబర్ 5 విడుదలని దాదాపు ఖరారు చేసినట్టుగా తిరుగుతున్న వార్త ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్ రేపుతోంది. వాళ్లేమో దసరాకి డిమాండ్ చేస్తున్నారు. కానీ పండగ స్లాట్ ని ఆల్రెడీ కాంతార చాప్టర్ 1, సంబరాల ఏటిగట్టు, ఇడ్లీ కడై తీసుకున్నాయి. అఖండ 2 తాండవం వాయిదా సూచనలు పుష్కలంగా ఉన్నాయి. ఇంత కాంపిటీషన్ మధ్య ఓజి వస్తే అందరికీ ఇబ్బందే. అందుకే ఉభయకుశలోపరిగా సెప్టెంబర్ మొదటి వారం బెస్టనే ఉద్దేశంతో ఆ దిశగా నిర్మాత డివివి దానయ్య, దర్శకుడు సుజిత్ ప్లానింగ్ లో ఉన్నట్టు సమాచారం.
సరే వినడానికి బాగుంది కానీ కాసేపు ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. వీరమల్లు బ్యాలన్స్ ఇంకా పూర్తవ్వలేదు. మూడు నాలుగు రోజులు పవన్ కళ్యాణ్ డేట్స్ దొరికితే చాలు అవగొట్టేస్తారు. కానీ రాజకీయ, వ్యక్తిగత, కుటుంబ కారణాలు పవర్ స్టార్ కు బ్రేకులు వేస్తూనే ఉన్నాయి. అలాంటప్పుడు ఓజికి ఇవ్వాల్సిన మూడు వారాల కాల్ షీట్స్ అంత సులభం కాదు. నిర్మాతలు ఎంత డెడ్ లైన్ పెట్టుకున్నా వాటిని చేరుకునేలా చేయడం పవన్ వల్ల కావడం లేదు. ఒకవేళ ఉపముఖ్యమంత్రి బాధ్యత, కీలక మంత్రిత్వ శాఖలు లేకుండా కేవలం ఎమ్మెల్యేగా ఉంటే సినిమాలు వేగంగా అయ్యేవేమో కానీ ఇప్పుడా ఛాన్స్ లేదు.
సో ఓజి సెప్టెంబర్ 5 ని లాక్ చేసుకున్నా చేసుకోకపోయినా ఏదీ ఎవరి చేతుల్లో లేదన్నది స్పష్టం. గత ఏడాది సెప్టెంబర్ 27 విడుదల తేదీ పోస్టర్ ఫ్యాన్స్ మనస్సులో ఫ్రెష్ గా ఉంది. ఏడాది గడిచిపోయినా ఇంకా సరైన అప్డేట్ రాకపోవడం విధి వైపరీత్యం. హీరోయిన్ ప్రియాంక మోహన్ తో సహా కీలక ఆర్టిస్టులతో పవన్ కళ్యాణ్ కాంబోలో కొంత యాక్షన్ పార్ట్ పెండింగ్ ఉందట. దాని కోసమే సుజిత్ వెయిట్ చేస్తున్నాడు. ఇమ్రాన్ హష్మీ లాంటి బిజీ ఆర్టిస్టులు అడిగిన వెంటనే దొరకరు. ఇవన్నీ బేరీజు వేసుకుంటే అభిమానుల తల బద్దలైపోతుంది. అందుకే ప్రశాంతంగా అఫీషియల్ అప్డేట్ వచ్చే దాకా ఎదురు చూడటం ఉత్తమం.
This post was last modified on April 26, 2025 9:46 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…