థియేటర్ రిలీజ్ కావాల్సినంత బిల్డప్ ఉన్న సినిమా ఓటిటిలో వస్తే అంతకంటే ఫ్యాన్స్ కోరుకునేది ఏముంటుంది. అందులోనూ ఫైటర్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ప్రొడక్షన్ అంటే ఎక్స్ పెక్టేషన్లు ఓ రేంజ్ లో ఉంటాయి. సైఫ్ అలీ ఖాన్ జ్యువెల్ థీఫ్ మీద అలాంటి అంచనాలే నెలకొన్నాయి. పాతాల్ లోక్ ఫేమ్ జయదీప్ ఆహ్లావత్ మరో ప్రధాన పోషించిన ఈ హీస్ట్ డ్రామా తాజాగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. దీనికి రాబీ గ్రేవాల్, కూకీ గులాటి సంయుక్తంగా దర్శకత్వం వహించారు. బడ్జెట్ భారీగానే ఖర్చు పెట్టారు. అయితే విడుదలైన కొద్ది గంటల్లోనే జ్యువెల్ థీఫ్ చూసిన అభిమానులు తలంటడం మొదలుపెట్టారు.
ఎందుకయ్యా అంటే కంటెంట్ అంత అత్తెసరుగా ఉంది కాబట్టి. ముందు కథేంటో చూద్దాం. వజ్రాల దొంగగా పేరొందిన రెహాన్ రాయ్ (సైఫ్ అలీ ఖాన్) ప్రపంచమంతా చక్కర్లు కొడుతూ ఉంటాడు. బయటికి పెద్ద మనిషిలా కనిపించే రంజన్ (ప్రదీప్ ఆహ్లావత్) వల్ల రెహాన్ తండ్రి సమస్యలో ఇరుక్కుంటాడు. ఆయన్ని బయట పడేసేందుకు ముంబై మ్యూజియంలో ఉన్న 500 వందల కోట్ల డైమండ్ దొంగతనం ఒప్పుకుంటాడు. టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ విక్రమ్ (కునాల్ కపూర్) నుంచి తప్పించుకుని ఈ మిషన్ ని రెహాన్ ఎలా పూర్తి చేశాడనేది అసలు స్టోరీ. ఎప్పుడో ఎనభై తొంబై దశకం నాటి స్టోరీలా అనిపిస్తుంది కదూ. ట్రీట్ మెంట్ కూడా అలాగే ఉంటుంది.
దేవానంద్ క్లాసిక్ టైటిల్ పెట్టుకున్నా క్యాస్టింగ్ కు తగ్గ సెటప్, ఖర్చు సినిమాలో లేకపోవడంతో పాటు రొటీన్ అనిపించే కథనంతో జ్యువెల్ థీఫ్ ఓపికకు పెద్ద పరీక్ష పెడుతుంది. విజువల్ ఎఫెక్ట్స్ సైతం అంతంత మాత్రంగా ఉండటం, ధూమ్ మనీ హీస్ట్ లాంటి వాటిని స్ఫూర్తిగా తీసుకుని అలాంటి ఎపిసోడ్సే పెట్టే ప్రయత్నం చేయడం బెడిసి కొట్టింది. ఫార్వార్డ్ చేయకుండా చూడటం కష్టమనిపించేలా జ్యువెల్ థీఫ్ మన సహనంతో ఫుట్ బాల్ ఆడతాడు. నికితా దత్తా పూర్తిగా గ్లామర్ షో కోసం వాడుకున్నారు. ఎన్నో కళాఖండాలు చూసిన గుండె మాది, ఇలాంటివి తట్టుకుంటాం అంటే తప్ప జ్యువెల్ థీఫ్ ఏ కోశానా రికమండేషన్ క్యాటగిరీలోకి రాడు.
This post was last modified on April 25, 2025 10:13 pm
చేసిన సినిమాలు తక్కువే అయినా.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే గ్రేటెస్ట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు రాజ్ కుమార్ హిరాని. కెరీర్…
టాలీవుడ్ అనే కాక ఇండియన్ బాక్సాఫీస్లో ఈ వేసవి పెద్దగా ఉత్సాహం నింపలేకపోయింది. మామూలుగా సమ్మర్లో పెద్ద సినిమాలు రిలీజై…
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఏ మాత్రం తగ్గకపోవడానికీ, తరచూ మళ్లీ మళ్లీ ఘర్షణలు చెలరేగడానికీ, అంతర్జాతీయ శక్తుల ఆడంబర నీతులు…
వైసీపీ హయాంలో పదవులు దక్కించుకున్న వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నాడు నెలకు 3 లక్షలకు పైగానే వేతనాల రూపంలో…
నితిన్ కెరీర్లో చాలా కీలకమైన సినిమా.. తమ్ముడు. ‘భీష్మ’ తర్వాత నితిన్కు ఓ మోస్తరు హిట్ కూడా లేదు. చెక్,…
జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. కొన్ని రోజుల కిందటే మళ్లీ ‘పవర్ స్టార్’గా మారారు. రాజకీయ నేతగా, మంత్రిగా…