కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన బింబిసార వచ్చి మూడేళ్లు దాటింది. ఆ తర్వాత మరో హిట్టు పడలేదు. అమిగోస్, డెవిల్ తీవ్రంగా నిరాశపరిచాయి. అయినా సరే బింబిసార సీక్వెల్ ని తీయడానికి సిద్ధపడిన కళ్యాణ్ రామ్ మొదటి భాగం దర్శకుడు వసిష్ఠ విశ్వంభరకు లాకైపోవడంతో పార్ట్ 2ని రొమాంటిక్ ఫేమ్ అనిల్ పాడూరికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అనౌన్స్ మెంట్ స్టేజి దాకా వచ్చిన ఈ ప్యాన్ ఇండియా ప్రాజెక్టు ఆ తర్వాత కదలిక లేకుండా ఆగిపోయింది. బడ్జెట్ చాలా ఎక్కువ డిమాండ్ చేయడంతో అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఖచ్చితంగా హిట్టవుతుందనే నమ్మకంతో కళ్యాణ్ రామ్ దాన్ని పెండింగ్ లో ఉంచాడు.
తీరా చూస్తే అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఫలితం నిరాశ కలిగించే దిశగా వెళ్తోంది. నాలుగైదు రోజులకు బ్రేక్ ఈవెన్ అయిపోతుందని కళ్యాణ్ రామ్ అన్న మాటలు నిజమయ్యే సూచనలు కనిపించడం లేదు. యాభై శాతం రికవరీకే కష్టపడుతున్న వైనం చూసి నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ నాలుగు రోజుల నుంచి సోషల్ మీడియా ప్రచారం ఆపేసింది. స్వయంగా తను కూడా నిర్మాణంలో పార్ట్ నర్ కావడంతో నష్టాల బరువు కళ్యాణ్ రామ్ మీద పడనుంది. తద్వారా బింబిసార 2 మీద ఎక్కువ పెట్టుబడి చేయలేని పరిస్థితి నెలకొందని ఇన్ సైడ్ టాక్. ఈ కారణంగానే సీక్వెల్ ని పక్కనపెట్టి మరో సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ఆదిత్య వర్మ, వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా తీసిన దర్శకుడు గిరిసాయ చెప్పిన కథ నచ్చడంతో ముందు దాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. అర్జున్ మీద నమ్మకం ఈ స్థాయిలో ఆవిరవ్వడం కళ్యాణ్ రామ్ ఊహించలేదు. రొటీన్ కమర్షియల్ టెంప్లేట్ కు మదర్ సెంటిమెంట్ తోడై ఖచ్చితంగా విజయం సాధిస్తుందనుకున్నాడు కానీ విజయశాంతి పాత్ర, షాక్ అనుకున్న క్లైమాక్స్ మిగిలిన బలహీనతలకు కాపాడలేకపోయాయి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు నిర్మాణ భాగస్వామిగా ఉన్న కళ్యాణ్ రామ్ దాంతో పాటు తన కొత్త సినిమా పనులు చూసుకుంటున్నాడు.
This post was last modified on April 25, 2025 10:53 am
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…