కొద్దిరోజుల క్రితం చెన్నైలో జరిగిన రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో సూర్య తండ్రి శివకుమార్ మాట్లాడుతూ కోలీవుడ్ లో మొదటి సిక్స్ ప్యాక్ తన బిడ్డే చేశాడని, అంతకు ముందు ఎవరూ చేయలేదని కాస్తంత ఎమోషనల్ గా కొడుకు గొప్పదనం గురించి చెప్పుకొచ్చారు. దీనికి అభిమానుల నుంచి భారీ స్పందన దక్కింది. ఇదే ప్రసంగంలో తమిళంలో ఇంతకు ముందు ఆరు పలకల దేహం ఎవరు చేయలేదని, ఉంటే చెప్పమని శివ కుమార్ యాంకర్లను ప్రశ్నించడం వైరలయ్యింది. అందరూ నిజమే కదా అంతకు ముందు ఎవరూ చేయలేదేమో, సూర్యనే శ్రీకారం చుట్టాడేమో అనుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడీ టాపిక్ పంచాయితీగా మారింది.
నిజానికి శివకుమార్ చెప్పిన ఉదాహరణ వారణమ్ ఆయిరం (సూర్య సన్నాఫ్ కృష్ణన్) గురించి. ఇది 2008 నవంబర్ లో విడుదలయ్యింది. దీనికన్నా రెండు నెలల ముందు ఆగస్ట్ లో రిలీజైన సత్యం (సెల్యూట్) లో విశాల్ సిక్స్ ప్యాక్ తో కనిపించాడు. అప్పట్లో ఆ స్టిల్స్ బాగా తిరిగాయి. అయితే వీళ్ళ కన్నా ముందు 2007 పొల్లాదవన్ (తెలుగు రీమేక్ కుర్రాడు) లో ధనుష్ మొదటిసారి సిక్స్ ప్యాక్ చేసి సంచలనం సృష్టించాడు. ఇదంతా ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో విశాల్ చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు మా హీరో ముందంటే మా హీరో ముందంటూ ఈ ఆరు పలకల క్రెడిట్ కోసం ఆన్ లైన్లో కొట్టేసుకుంటున్నారు.
సోషల్ మీడియా ఎంత అలెర్ట్ గా ఉంటుందో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదేమో. శివకుమార్ ఏదో యథాలాపంగా అన్న మాటను పట్టుకుని దాన్ని సూర్య ఫ్యాన్స్ వైరల్ చేస్తే, అది విశాల్ దాకా చేరిపోయి, ఎవరు ముందు చేశారనేది గుర్తించి, తనదే ఫస్ట్ రిలీజైన సంగతిని ప్రత్యేకంగా పంచుకునే దాకా వెళ్ళింది. మన టాలీవుడ్ లో అంతకు ముందే అల్లు అర్జున్, నితిన్ తదితరులు ఈ ఫీట్ సాధించి కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు. తర్వాత దాదాపు అందరూ ఫాలో అయినవాళ్లే. ఇప్పుడంటే దీని మీద క్రేజ్ తగ్గిపోయింది కానీ ఒకప్పుడు యూత్ లో సిక్స్ ప్యాక్ అంటే పిచ్చ క్రేజ్ ఉంది. జిమ్ లో ప్యాకేజీలు ఉండేవి.
This post was last modified on April 25, 2025 10:29 am
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…