సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 షూటింగ్ ప్రస్తుతం కేరళలో నాన్ స్టాప్ గా జరుగుతోంది. ప్రధాన క్యాస్టింగ్ పాల్గొనగా కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఇందులో పుష్ప విలన్ ఫహద్ ఫాసిల్ చేరబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఇంతకు ముందు ఇతను రజని వెట్టయన్ లో ఒక ముఖ్య పాత్ర పోషించాడు. కాంబినేషన్ సీన్లు చాలానే పడ్డాయి. సినిమా పెద్ద విజయం సాధించలేదు కానీ తనవరకు ఫహద్ మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఈ శైలి నచ్చడం వల్లే ప్రత్యేకంగా రజని రికమండేషన్ మీద జైలర్ 2 ఛాన్స్ దక్కించుకున్నట్టు చెన్నై రిపోర్ట్.
క్యారెక్టర్ ఎలా ఉంటుందనే లీక్ మాత్రం ఇంకా రాలేదు. విలన్ గానా లేక మొదటి భాగంలో రజనీకాంత్ కొడుకు చనిపోయాడు కాబట్టి అతని స్థానంలో వచ్చే దత్త పుత్రుడా అనే క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. కోడలు, మనవడు ఒంటరి వారు అయ్యారు కాబట్టి భర్త స్థానాన్ని భర్తీ చేసేందుకు దళపతి తరహాలో ఫహద్ ఫాసిల్ ఎంట్రీని నెల్సన్ ప్లాన్ చేసినట్టు వినిపిస్తోంది. అదే నిజమైతే ఈసారి మరిన్ని ఆసక్తికరమైన ఎపిసోడ్స్ చూడబోతున్నాం. విగ్రహాల దొంగతనంని పార్ట్ 1లో బ్యాక్ డ్రాప్ గా తీసుకున్న డైరెక్టర్ ఈసారి ఎలాంటి స్మగ్లింగ్ సెట్ చేశారనే ఆసక్తి అభిమానుల్లో ఎక్కువగా ఉంది. ఊహించని సెటప్పు ఉంటుందట.
ఇదిలా ఉండగా విడుదల తేదీ గురించి ఎలాంటి సమాచారం లేకుండానే జైలర్ 2 హక్కులకు డిమాండ్ ఏర్పడుతోంది. తెలుగు నుంచి సుమారు 50 కోట్ల దాకా ఆఫర్ వెళ్లిందట. అయితే సన్ పిక్చర్స్ ఇంకా ఎక్కువ ఆశిస్తుండటంతో ట్రైలర్ వచ్చాక రేట్ డిసైడ్ చేయాలని నిర్ణయిచుకున్నట్టు అంతర్గత టాక్. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్న జైలర్ 2లో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ పాత్రలు కొనసాగుతాయి. బాలకృష్ణ క్యామియో ఉండొచ్చనే లీక్ ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి ఉంది. ఇంకా నిర్ధారణ కాలేదు. 2026 సంక్రాంతి లేదా వేసవిలో విడుదల చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది. వచ్చే దీపావళిలోగా షూట్ అయిపోవచ్చట.
This post was last modified on April 25, 2025 5:49 am
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…