ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా పద్దెనిమిది వందల కోట్ల వసూళ్లతో ఆల్ టైం రికార్డులు సృష్టించిన పుష్ప 2 ది రూల్ మొదటిసారి శాటిలైట్ ఛానల్ లో ప్రీమియర్ అవుతున్నప్పుడు భారీ రేటింగ్స్ వస్తాయని ఆశించడం సహజం. దానికి తగ్గట్టే స్టార్ మా టీమ్ విస్తృతంగా ప్రమోషన్లు చేసింది. సుకుమార్, దేవిశ్రీప్రసాద్ తదితరుల ప్రత్యేక ఇంటర్వ్యూ ఫుటేజ్ తీసుకుని ప్రసారం మధ్యలో ఎక్స్ క్లూజివ్ కంటెంట్ గా వదిలింది. ఇన్ని చేసినా పుష్ప 2 టిఆర్పి రేటింగ్స్ లో మహాద్భుతం చేయలేకపోయింది. అనుకున్న దానికన్నా కొంచెం ఆటుఇటు సగమే రీచ్ అయ్యి అభిమానులకు, టీవీ వర్గాలకు ఊహించని షాక్ ఇచ్చింది.
రిపోర్ట్స్ ప్రకారం పుష్ప 2 ది రూల్ కు వచ్చిన టిఆర్పి 12.61 మాత్రమే. ఇది మంచి నెంబరే కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర అందుకున్న ఫలితంతో చూస్తే చాలా తక్కువ. గతంలో అల వైకుంఠపురములో (29.4), పుష్ప ది రైజ్ (22.5), డీజే దువ్వాడ జగన్నాథం (21.7) బన్నీ చిత్రాల్లో అగ్ర స్థానంలో ఉండగా సూపర్ ఫ్లాప్ గా నిలిచిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా (12.5) కి దగ్గరగా పుష్ప 2 నెంబర్ నమోదు కావడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ ప్రీమియర్ జరుగుతున్న టైంలోనే సంక్రాంతికి వస్తున్నాం రెండోసారి జీ ఛానల్ లో రావడం కొంత ప్రభావం చూపించి ఉంటుంది కానీ అది కూడా 6 లోపే నమోదు చేసుకుంది.
ఇక్కడ కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. ఓటిటిలు వచ్చాక మునుపటిలా కొత్త సినిమాలు టీవీలో అదే పనిగా చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడటం లేదు. అందులోనూ పైరసీ అందుబాటు, థియేటర్ రన్ కాగానే లోకల్ ఛానల్స్ లో వాటిని త్వరగా ప్రసారం చేయడం లాంటి కారణాలు టిఆర్పికి అడ్డుపడుతున్న మాట వాస్తవం. గంటల తరబడి యాడ్స్ భరిస్తూ ఇబ్బంది పడటం కన్నా కోరుకున్న టైంలో సౌకర్యవంతంగా రివైండ్, ఫార్వార్డ్ చేసుకుంటూ వచ్చే సౌలభ్యాన్ని ఆడియన్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇలా అయితే భవిష్యత్తులో శాటిలైట్ హక్కుల డిమాండ్ మరింత కిందకు పడిపోతుంది. ఇది నిర్మాతలకు ఆందోళన కలిగించేదే.
This post was last modified on April 24, 2025 3:06 pm
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…
లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…