బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిర్లిప్తత నెలకొంది. చాలా థియేటర్ల దగ్గర స్మశాన వైరాగ్యం కనిపిస్తోంది. పట్టుమని పది మంది రాక షోలు క్యాన్సిల్ చేసుకుంటూ, సిబ్బంది జీతాలను భరాయించుకుంటూ ఎగ్జిబిటర్లు చూస్తున్న నరకం అంతా ఇంతా కాదు. అర్జున్ సన్నాఫ్ వైజయంతి, ఓదెల 2 ఊపిరి పోస్తాయనుకుంటే హడావిడి తప్ప కలెక్షన్ల పరంగా ఎలాంటి అద్భుతాలు చేయలేకపోవడంతో కథ మళ్ళీ మొదటికే వచ్చింది. ఓ రెండు మూడు రోజులు కళ్యాణ్ రామ్ పరవాలేదనిపించినా తర్వాత సైలెంట్ అయిపోవడం పరిస్థితిని ఇంకా కిందకు తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో రేపు ఏకంగా డజను కొత్త సినిమాలు రిలీజ్ కానున్నాయి.
ఉన్నంతలో కొంచెం ఎడ్జ్ కనిపిస్తోంది సారంగపాణి జాతకంకే. ప్రియదర్శి, వెన్నెల కిషోర్, హర్ష చెముడు లాంటి నోటెడ్ క్యాస్టింగ్ తో ట్రైలర్ లో చూపించిన ఫన్ కాసింత అంచనాలు రేకెత్తించేలా చేసింది. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ట్రాక్ రికార్డు కొంత డౌన్ లోనే ఉన్నా అష్టాచెమ్మ, సమ్మోహనం నాటి హాస్యాన్ని, సున్నితత్వాన్ని కనక ఇందులో చూపిస్తే ఫ్యామిలీ ఆడియన్స్ ని టికెట్లు కొనేలా చేయొచ్చు. కాంపిటీషన్ లో ఉన్న చౌర్య పాఠం కొంచెం వెరైటీ పబ్లిసిటీతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మార్కెట్ పరంగా వెనుకబడి ఉన్న సంపూర్ణేష్ బాబు సోదరా ఏ మేరకు జనాన్ని రప్పిస్తుందో మార్నింగ్ షో అయ్యాక కానీ చెప్పలేం.
శివ శంభో, హలొ బేబీ, ఏఎల్సిసి, సర్వం సిద్ధం, సూర్యాపేట జంక్షన్, మన ఇద్దరి ప్రేమకథ, సిక్స్ జర్నీ ఇవేవి కనీసం పేర్లు కూడా ఆడియన్స్ కి తెలియనంత వీక్ గా ప్రమోషన్లు చేసుకున్నాయి. మలయాళం డబ్బింగులు తుడరుమ్, అలిపుజ జింఖానాలు ఏదైనా అద్భుతం చేస్తే తప్ప మన ప్రేక్షకులను కదిలించడం కష్టం. ఒరిజినల్ వెర్షన్ టాక్స్ ఎలా ఉన్నా ఇక్కడ బజ్ లేకపోవడం గమనించాలి. సో ఎలా చూసుకున్నా సారంగపాణి జాతకం కనక కనీసం ఎబోవ్ యావరేజ్ టాక్ తెచ్చుకున్నా వసూళ్లు కళ్లచూడవచ్చు. వచ్చే వారం మే 1 నాని హిట్ 3 ది థర్డ్ కేస్ వచ్చేలోపు ఎంత రాబట్టుగోగలిగితే అంత సారంగపాణికి అంత మేలు.
This post was last modified on April 24, 2025 11:43 am
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…