యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఒకప్పుడు తెరను ఏలిన రాజశేఖర్ చాలా ఏళ్లుగా ట్రాక్ తప్పేశారు. తన సమకాలీకులైన సీనియర్ హీరోల్లో కొందరు ఇంకా రాణిస్తుండగా మరికొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయి సెకండ్ ఇన్నింగ్స్ ని బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు. జగపతిబాబు, శ్రీకాంత్ లాంటివాళ్లను ఉదాహరణగా తీసుకోవచ్చు. కానీ రాజశేఖర్ రెండింట్లోనూ ఇమడలేకపోతున్నారు. ఆ మధ్య నితిన్ ఎక్స్ ట్రాడినరి మ్యాన్ లో స్పెషల్ రోల్ చేశారు కానీ అది డిజాస్టర్ కావడంతో ఆయన ఉన్న సంగతే ఎవరికీ గుర్తు లేకుండా పోయింది. అంతకు ముందు మళయాలం జోసెఫ్ రీమేక్ శేఖర్ బాక్సాఫీస్ వద్ద దారుణంగా దెబ్బ కొట్టింది.
ఇదే కాదు తమిళ బ్లాక్ బస్టర్ సూదు కవ్వంని కోరిమరీ గడ్డం గ్యాంగ్ గా రీమేక్ చేసుకుంటే థియేటర్ రన్ తర్వాత కనీసం ఓటిటి, శాటిలైట్ అమ్మకలకు సైతం నోచుకోలేకపోయింది. అంతకు ముందు మహంకాళి, మా అన్నయ్య బంగారం, నా స్టైలే వేరు అన్నీ ఫ్లాపే. 2017 లో వచ్చిన పిఎస్వి గరుడవేగ ఒక్కటే కమర్షియల్ గా ఊరట కలిగించిన సూపర్ హిట్. ఇదంతా జరిగి తొమ్మిదేళ్లు గడిచిపోయాయి. రాజశేఖర్ మళ్ళీ కంబ్యాక్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. శర్వానంద్ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నారనే టాక్ ఉంది కానీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉండగా ఆయన మరో రీమేక్ కొన్నారట.
గత ఏడాది తమిళంలో మంచి హిట్టు అందుకున్న లబ్బర్ పందుని తెలుగులో తీసే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసింది. ఇందులో వయసు మళ్ళిన ఒక తండ్రికి, అల్లుడు కావాలనుకున్న ఒక కుర్రాడికి మధ్య క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా జరుగుతుంది. పల్లెటూరి నేపథ్యంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామకు పెద్ద బడ్జెట్ అక్కర్లేదు. ఎమోషన్, ఎంటర్ టైన్మెంట్, లవ్ స్టోరీ ఇలా అన్ని పుష్కలంగా ఉంటాయి. కాకపోతే మన నేటివిటీకి సూటవ్వడం గురించే అనుమానం లేకపోలేదు. తెలుగు ఆడియోతో సహా ఇది ఓటిటిలో అందుబాటులో ఉంది. మరి రాజశేఖర్ అంతా తెలిసి రిస్క్ కి సిద్ధపడటం చూస్తే కంటెంట్ మీద ఓ రేంజ్ నమ్మకమున్నట్టే.
This post was last modified on April 24, 2025 10:27 am
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…