ధనుష్, నాగార్జున కలయికతో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న కుబేర పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు కొలిక్కి వస్తున్నాయి. ఎడిటింగ్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ సిద్ధం కాగానే దేవిశ్రీ ప్రసాద్ రీ రికార్డింగ్ మొదలవుతుంది. జూన్ 20 విడుదల తేదీని అధికారికంగా లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే రిలీజ్ చేసిన పోయిరా మామ లిరికల్ సాంగ్ కు మంచి రీచ్ వస్తోంది. మొదట్లో కొంచెం రెగ్యులర్ ట్యూన్ లా అనిపించినా ఎప్పటిలాగే దేవి స్లో పాయిజన్ మ్యూజిక్ లవర్స్ కు మెల్లగా ఎక్కేస్తోంది. ఇది ఇంకా మొదటి పాటే కనక తర్వాత వచ్చే మొత్తం ఆల్బమ్ లో ఇంకా మంచి సాంగ్స్ ఉన్నాయనే టాక్ అంతర్గతంగా ఉంది.
ఇక బిజినెస్ పరంగా కుబేరకు బేరాలు మొదలైపోయాయట. అనుకున్న దాని కన్నా చాలా ఎక్కువ బడ్జెట్ అయ్యిందని ఇన్ సైడ్ టాక్. రెమ్యునరేషన్లు, బ్యాంకాక్ షెడ్యూల్స్, ఖరీదయిన టెక్నికల్ టీమ్, నిర్మాణంలో జాప్యం తదితర అంశాలు ప్రొడక్షన్ కాస్ట్ ని బాగా పెంచాయట. అటు ఇటుగా నిర్మాణ వ్యయం వంద కోట్లకు పైగానే అయ్యిందని అంటున్నారు. అయితే పెట్టుబడి పరంగా ఎలాంటి టెన్షన్ లేదట. ఎందుకంటే హిందీ డబ్బింగ్, డిజిటల్, ఇతర బాషల అనువాదాలు, ఓటిటి, ఆడియో వీటి నుంచే ముప్పాతిక శాతం రికవరీ అయ్యిందంటున్నారు. తెలుగు, తమిళ థియేట్రికల్ రైట్స్ కోసం ఒప్పందాలను ఇంకా ఖరారు చేయలేదు.
సో రిలీజ్ కు ముందే కుబేర భారీ లాభాలతో సేఫ్ జోన్ లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రష్మిక మందన్న హీరోయిన్ కావడం, ధనుష్ ఇమేజ్, నాగ్ కు బాలీవుడ్లో ఉన్న గుర్తింపు హిందీలోనూ పెద్ద బిజినెస్ తీసుకొస్తున్నాయట. ట్రైలర్ తర్వాత వీటికి మరింత డిమాండ్ పెరుగుతుందనే అంచనాలో నిర్మాతలున్నారు. కటిక పేదవాడు కోట్లకు పడగలెత్తితే అతని వెంట పడిన ప్రభుత్వం ఏం చేసిందనే పాయింట్ మీద రూపొందిన ఈ మనీ క్రైమ్ మూవీలో ఊహించని ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. అంతలేనిదే నాగార్జున ఎందుకు ఒప్పుకుంటారు. వచ్చే నెల మేలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ప్లానింగ్ జరుగుతోంది.
This post was last modified on April 23, 2025 2:49 pm
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…