‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో గాడిన పడ్డట్లే పడి.. ఆ తర్వాత ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాలతో ఎదురు దెబ్బలు తిన్నాడు సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. మామూలుగా చివరి చిత్రం ఫలితం ఎలా ఉన్నా.. వెంటనే తర్వాతి చిత్రాన్ని మొదలుపెట్టేస్తుంటాడు పూరి. కానీ ఈసారి మాత్రం ఇబ్బంది తప్పలేదు. టాలీవుడ్ స్టార్లలో ఎవ్వరూ ఆయనతో సినిమా చేయడానికి రెడీగా లేని పరిస్థితి. నిర్మాత దొరకడమూ కష్టమైంది. ఐతే విజయ్ సేతుపతి లాంటి విలక్షణ నటుడికి కథ చెప్పి మెప్పించడంతో పూరి మళ్లీ ప్రేక్షకులతో పాటు నిర్మాతల దృష్టిని కూడా ఆకర్షించగలిగాడు. ఈ కలయికలో త్వరలోనే సినిమా సెట్స్ మీదికి వెళ్లబోతోంది.
టబు, రాధికా ఆప్టే లాంటి ఆర్టిస్టులు ఈ ప్రాజెక్టులోకి రావడంతో క్రేజ్ ఇంకా పెరిగింది. మరోవైపు సినిమాలో అత్యంత కీలకమైన విలన్ పాత్ర కోసం సరైన నటుడిని ఎంచుకోవాలని చూస్తున్నాడు పూరి. అందుకోసం ఆయన ఫస్ట్ ఛాయిస్ ఫాహద్ ఫాజిల్ అట. అతడికి పూరి కథ కూడా చెప్పాడు. అతడికి నచ్చిందని సమాచారం. కానీ సౌత్ ఇండియాలో బిజీయెస్ట్ యాక్టర్లలో ఒకడైన ఫాహద్.. ఈ సినిమాకు డేట్లు సర్దుబాటు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడట.
ఇంతకుముందు సేతుపతి, ఫాహద్ కలిసి ‘విక్రమ్’లో నటించారు. ఈ కాంబో బాగా వర్కవుట్ అయింది. అందులో సేతుపతి విలన్‌గా చేశాడు. ఫాహద్‌ది సహాయ పాత్ర. కానీ ఈసారి అతను హీరోగా నటిస్తే.. ఫాహద్ విలన్ పాత్ర చేయాల్సి ఉంది. ఈ కలయిక మరింత ఆసక్తిని రేకెత్తిస్తుందనడంలో సందేహం లేదు. ఐతే పూరి ఎవరి కోసం ఎక్కువ రోజులు ఎదురు చూసే రకం కాదు. అందుకోసం ప్రత్యామ్నాయాలు కూడా చూసి పెట్టుకున్నాడు. ‘యానిమల్’తో వెలుగులోకి వచ్చి ‘పుష్ప-2’లోనూ నటించిన సౌరభ్ సచ్‌దేవా పేరునూ పరిశీలిస్తున్నాడు. కానీ ఫాహద్ చేస్తే ఈ సినిమా క్రేజే వేరుగా ఉంటుంది. మరి అతను డేట్లు సర్దుబాటు చేస్తాడా లేదా అన్నదే చూడాలి.
This post was last modified on April 23, 2025 2:28 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…