90ల్లో అప్పటి పిల్లల్ని ఉర్రూతలూగించిన టీవీ సీరియళ్లలో ‘శక్తిమాన్’ ఒకటి. దూరదర్శన్‌లో సూపర్ హిట్టయిన ఈ సీరియల్‌లో ప్రధాన పాత్ర పోషించి ఎనలేని ఆదరణ సంపాదించుకున్నాడు ముకేష్ ఖన్నా. ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించినా, ఎన్ని పాత్రలు చేసినా ‘శక్తిమాన్’తో తెచ్చుకున్న గుర్తింపే వేరు. ఐతే కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా, లైమ్ లైట్లో లేకుండా పోయిన ముకేష్ ఖన్నా.. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో వ్యక్తి అయిపోయారు. ఆయనకున్న పేరును ఆ వ్యాఖ్యలు బాగా దెబ్బ తీశాయి.
సినీ పరిశ్రమతో పాటు వివిధ రంగాల్లో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై కొన్నేళ్లుగా ‘మీటూ’ పేరుతో ఉద్యమం సాగుతున్న సంగతి తెలిసిందే. దీని గురించి ముకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పని ప్రదేశాల్లో మహిళలపై జరిగే లైంగిక వేధింపులకు వారిదే బాధ్యత అన్న అర్థం వచ్చేలా మాట్లాడాడు ముకేష్ ఖన్నా.
సమాజంలోని ప్రతి అంశంలో తామూ మగవాళ్లతో సమామని భావించడం వల్లే మహిళలు లైంగిక దాడికి గురవుతున్నారని.. ఆడవాళ్లు ఇంటి పట్టున ఉండకుండా బయటకి వచ్చాకే ‘మీటూ’ మొదలైందని.. ఈ ఉద్యమానికి బాధ్యత వహించాల్సింది మహిళలే అని.. వారు పురుషులతో భుజం భుజం రాసుకు తిరగకుండా ఇంటి పని చూసుకుంటే మంచిదని ఇటీవల వ్యాఖ్యానించాడు ముకేష్.
ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలోనే దుమారం రేగింది. సోషల్ మీడియాలో మహిళలు ఆయనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పురుషులు సైతం పెద్ద ఎత్తున ఈ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ‘మీ టూ’లో భాగంగా అలుపెరగని పోరాటం చేస్తున్న చిన్మయి లాంటి వాళ్లు ఈ విషయాన్ని మరింతగా సోషల్ మీడియాలోకి తీసుకెళ్లారు.
దీంతో ముకేష్ పేరు బాగా దెబ్బ తింది. ఆయన అన్‌పాపులర్ అయ్యాడు. దీంతో తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పక తప్పలేదు. తాను మహిళల్ని గౌరవించడంలో ఎప్పుడూ ముందుంటానని.. తన వ్యాఖ్యలని తప్పుగా అర్థం చేసుకున్నారని.. తన వల్ల బాధ పడ్డవాళ్లందరినీ క్షమాపణలు చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు. కానీ ఈలోపే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది.
This post was last modified on November 3, 2020 9:43 am
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…