నారా రోహిత్‌ను తెర మీద చూసి చాలా కాలం అయిపోయింది. ఒక దశలో అతడి సినిమాలు తొమ్మిది సినిమాలు లైన్లో ఉన్నాయి. రెండు మూడేళ్ల వ్యవధిలో ఆ సినిమాలన్నీ రిలీజయ్యాయి కూడా. ఐతే వాటిలో మెజారిటీ తీవ్ర నిరాశకు గురి చేశాయి. అలా మొదలైన పరాజయ పరంపరం నిరాటంకంగా సాగిపోయింది. గత నాలుగేళ్లలో రోహిత్ నుంచి ఒక్క హిట్టు సినిమా కూడా రాలేదు.
గత రెండేళ్లలో నారా రోహిత్ సినిమాలు చేయడమే మానేశాడు. చివరగా వీర భోగ వసంతరాయలులో నటించాడతను. ఆ సినిమా ఫలితం గురించి తెలిసిందే. అనగనగా దక్షిణాదిన పేరుతో ఒక భారీ సినిమాను మొదలుపెట్టినట్లే పెట్టి ఆపేసిన రోహిత్.. మరే కొత్త సినిమాను ప్రకటించలేదు. ఈ మధ్య బరువు తగ్గి, లుక్ మార్చుకునేసరికి కొత్త సినిమా ప్రకటన ఉంటుందనే సంకేతాలు కనిపించాయి. కానీ చప్పుడు లేదు.
రోహిత్ కొత్త సినిమాల గురించి అప్పుడప్పుడూ ఆసక్తికర ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఏదీ కార్యరూపం దాల్చట్లేదు. కొన్ని రోజుల కిందట పుష్పలో ఓ పాత్ర కోసం రోహిత్‌ను కన్సిడర్ చేస్తున్నారని, అల్లు అర్జునే అతణ్ని సుక్కుకు సిఫారసు చేశాడని వార్తలొచ్చాయి. కట్ చేస్తే అలాంటిదేమీ లేదని తేలిపోయింది. తాజాగా నాని చేయబోతున్న ప్రెస్టీజియస్ మూవీ శ్యామ్ సింగరాయ్‌లో నారా రోహిత్ ఓ కీలక పాత్ర చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి.
ట్యాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన ఈ సినిమా నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీతనంతో తెరకెక్కనుంది. ఇలాంటి వైవిధ్యమైన సినిమాలో రోహిత్ నటించాడంటే అతడి కెరీర్‌కు మంచిదే. కానీ ఇలా వార్తలు రావడమే తప్ప రోహిత్ సినిమాలేవీ పట్టాలైతే ఎక్కట్లేదు. మరి ఈ వార్త అయిన నిజం అయి ఈ టాలెంటెడ్ హీరో మళ్లీ తెరపై కనిపిస్తాడేమో చూడాలి.
This post was last modified on November 2, 2020 10:34 pm
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…