టాలీవుడ్ దశనే కాదు ఇండియన్ సినిమా రూపురేఖలను కొత్త దిశ వైపు మళ్లించిన మొదటి ప్యాన్ ఇండియా మూవీగా బాహుబలి స్థానం ప్రత్యేకం. అప్పటిదాకా స్టార్ హీరోగా తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన ప్రభాస్ ఇమేజ్ ఏకంగా దేశాలు దాటిపోయి అమెరికా నుంచి జపాన్ దాకా పాకింది. పులిని చూసి నక్కను వాత పెట్టుకున్న తరహాలో హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఇలాంటి క్లాసిక్ ఒకటి తీయాలని ప్రయత్నించి బొక్కా బోర్లాపడిన వాళ్ళు ఎందరో. మోహన్ లాల్, విజయ్ లాంటి ఎందరో చేసిన ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. అసలు పాయింట్ ఇది కాదు. దర్శకుడు రోహిత్ శెట్టి గురించి.
పోలీస్ కథలకు కమర్షియల్ మసాలా జోడించడంలో ఇతని నైపుణ్యం తెలిసిందే. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో యాంకర్ మన దక్షిణాది చిత్రాల గురించి గొప్పగా మాట్లాడుతుంటే మధ్యలో అడ్డుతగిలి మనం ఏనాడో షోలే, మొఘల్ ఏ అజమ్ ఇచ్చామంటూ పంచులు వేయబోయి కౌంటర్ అయ్యాడు. వర్తమానం గురించి చెప్పమంటే గతాన్ని హైలైట్ చేయబోయాడు. ఇప్పుడదే రోహిత్ శెట్టి ఇటీవలే ఇచ్చిన ఒక పాడ్ క్యాస్ట్ ముఖాముఖీలో బాహుబలి, కల్కి 2898 ఏడి తనను బాగా ఇన్స్ పైర్ చేసిన సినిమాలని, కుటుంబ సభ్యులు కూడా బాగా ఎంజాయ్ చేశారని, వాటిని చూసి నా లాంటి ఫిలిం మేకర్స్ నేర్చుకోవాలని అన్నాడు.
చూశారా కాల మహిమ. ఒకప్పుడు టాలీవుడ్ గొప్పదనాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడని బాలీవుడ్ డైరెక్టర్ ఇప్పుడు అతనే స్వయంగా పొగడ్తల వర్షం కురిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో బాగా చక్కర్లు కొడుతోంది. అయినా రోహిత్ శెట్టికి పెద్ద బ్రేక్ ఇచ్చిన సింగం సిరీస్ కూడా తమిళం నుంచి తీసుకున్నదే కానీ స్వంతం కాదుగా. అదే ఫార్ములాని వాడుతూ ఆ మధ్య సూర్యవంశీ అనే సినిమా, ప్రైమ్ కోసం ఒక వెబ్ సిరీస్ తీశాడు అవేవి ఆశించిన గొప్ప స్థాయిలో ఆడలేదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రభాస్ సినిమాలు ఇంటర్నేషనల్ మార్కెట్ లో భారతీయ కంటెంట్ కి డిమాండ్ తీసుకొచ్చిన మాట వాస్తవం.
This post was last modified on April 21, 2025 3:12 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…