చాలా ఆశలు పెట్టుకుని చేసిన రాబిన్ హుడ్ తీవ్రంగా నిరాశ పరచడంతో నితిన్ అభిమానులు తమ్ముడు కోసం ఎదురు చూస్తున్నారు. వకీల్ సాబ్ తర్వాత అదే దిల్ రాజు బ్యానర్లో దర్శకుడు వేణు శ్రీరామ్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు బానే ఉన్నాయి. ప్రస్తుతం చివరి దశ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న తమ్ముడుని జూలై 4 విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్టుగా లేటెస్ట్ అప్డేట్. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ఇంకొద్ది గంటల్లో లేదా రోజుల్లో ఆ లాంఛనం జరిగిపోవచ్చు. ముందు మే లేదా జూన్ అనుకున్నారు కానీ కాంపిటీషన్ దృష్ట్యా ఇప్పుడు జూలై లాక్ చేసుకుని తెలివైన అడుగు వేశారు.
ఎందుకంటే నితిన్ కు వరసగా డిజాస్టర్స్ పడ్డాయి. ఒక ఫ్లాప్ తర్వాత మరీ తక్కువ గ్యాప్ లో ఇంకో సినిమా వస్తే దాని ప్రభావం బిజినెస్ తో పాటు ఓపెనింగ్స్ మీద పడుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే పబ్లిసిటీ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వైరల్ ప్రమోషన్లు ప్లాన్ చేసుకోవాలి. ఇవి హడావిడిగా జరిగేవి కాదు. రాబిన్ హుడ్ కు కొంత మేర చేశారు కానీ పనవ్వలేదు. ఈసారి రిపీట్ అనిపించకుండా కొత్త తరహా స్ట్రాటజీలు అవసరం. అందుకే ఏప్రిల్ మినహాయించి ఇంకో రెండు నెలలు సమయం ఉంటుంది కాబట్టి టెన్షన్ లేకుండా అన్నీ చూసుకోవచ్చు. అందుకే జూలై 4 మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.
అక్కా తమ్ముడు సెంటిమెంట్ మీద కమర్షియల్ కథ రాసుకున్న వేణు శ్రీరామ్ ఈ తమ్ముడుని పెద్ద బడ్జెట్ తోనే తెరకెక్కించారు. ఒక్క ఫైట్ కే రెండు కోట్లకు పైగా ఖర్చు పెట్టడం నితిన్ కు గతంలోనే జరగలేదు. ఇలాంటి యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా వచ్చాయని అంటున్నారు. నితిన్ అక్కగా సీనియర్ నటి లయ పెర్ఫార్మన్స్ హైలైట్ గా ఉంటుందని టాక్. కాంతారా ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా చేయడం మరో అట్రాక్షన్. జూలై మొదటి వారంలో చెప్పుకోదగ్గ పోటీ ఏది లేదు. అదే నెలలో మాస్ జాతర, విశ్వంభర వచ్చే సూచనలున్నాయి కానీ అవి తమ్ముడుతో క్లాష్ కాకపోవచ్చు. సో నితిన్ ఆడేది సేఫ్ బెట్టే.
This post was last modified on April 21, 2025 9:20 am
వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…
నెలలో ఒక్కరోజు గ్రామీణ ప్రాంతాలకు రావాలని.. ఇక్కడి వారికి వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…