ఒకప్పుడు దక్షిణాదిన ఒక వెలుగు వెలిగిన నిర్మాతల్లో ఏఎం రత్నం ఒకరు. శ్రీ సూర్య మూవీస్ అనే బేనర్ కనిపిస్తే చాలు.. ఆ చిత్రం మీద భారీ అంచనాలు ఏర్పడేవి. కర్తవ్యం, భారతీయుడు, స్నేహం కోసం, ఖుషి లాంటి భారీ విజయాలతో నిర్మాతగా వైభవం చూశారాయన. ఆ రోజుల్లో ఉన్న బడ్జెట్ పరిమితులను ఏమాత్రం పట్టించుకోకుండా భారీగా ఖర్చు పెట్టి సినిమాలు తీసేవారాయన. ఎందరో నిర్మాతలకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు. కానీ ఎలాంటి నిర్మాతకైనా నిలకడగా విజయాలు సాధించడం కీలకం. అవి లేకే రత్నం కూడా వెనుకబడిపోయారు. ముఖ్యంగా తన కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వంలో తీసిన సినిమాలన్నీ ఆయన్ని దారుణంగా దెబ్బ కొట్టాయి.
వేరే చిత్రాలు కూడా వర్కవుట్ కాక.. కొన్నేళ్ల సినిమా నిర్మాణానికే దూరం అయిపోయారు రత్నం. మళ్లీ ఆయన చాలా గ్యాప్ తర్వాత మొదలుపెట్టిన పెద్ద సినిమా.. హరిహర వీరమల్లు. ఈ సినిమా కోసం దయానందరెడ్డి అనే భాగస్వామిని కూడా తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ హీరో.. క్రిష్ దర్శకుడు.. పైగా పీరియడ్ స్టోరీ.. ఇంకేముంది బాక్సాఫీస్ బద్దలే అనుకున్నారంతా. సినిమా మొదలైనపుడు, టీజర్ వచ్చినపుడు హైప్ మామూలుగా లేదు. కానీ పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఇతర సినిమా, రాజకీయ కమిట్మెంట్ల ప్రభావం ‘వీరమల్లు’పై పడి ఆ సినిమా అన్యాయం అయిపోయింది. మొదలైన ఐదేళ్లకు కూడా రిలీజ్ కాని పరిస్థితి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ‘వీరమల్లు’ను మే 9 నుంచి కూడా పోస్ట్ పోన్ చేశారన్నది స్పష్టం. ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు.
చివరి షెడ్యూల్ చిత్రీకరణకు పవన్ ఎప్పుడు హాజరవుతాడో క్లారిటీ లేదు. ఇప్పటికే సినిమా బడ్జెట్ తడిసి మోపెడైంది. వడ్డీల భారం మోయలేనంతగా మారింది. మరోవైపు సినిమాకు ఇంతకుముందున్న హైప్ అంతా తగ్గిపోయింది. సినిమా విపరీతంగా ఆలస్యం కావడం, దర్శకుడు మారడం లాంటి కారణాలతో ఇటు ప్రేక్షకుల్లో, అటు ట్రేడ్ వర్గాల్లో సినిమాకు క్రేజ్ కనిపించడం లేదు. పెట్టిన బడ్జెట్ రికవర్ చేయడం చాలా కష్టమే. తక్కువ నష్టాలతో బయటపడ్డమూ సవాలుగా మారే పరిస్థితి. ఈ సినిమా దెబ్బకు రత్నం తీవ్ర సంక్షోభంలో పడిపోయాడని సన్నిహిత వర్గాలంటున్నాయి.
This post was last modified on April 20, 2025 6:14 pm
హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగాక.. ఏదో ఒక దశలో డౌన్ కావాల్సిందే. హీరోల మాదిరి దశాబ్దాల తరబడి కెరీర్లో పీక్స్‌లో…
టాలీవుడ్ అగ్ర నటుడు, టీడీపీ సీనియర్ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండో అమెరికన్ బసవతారకం…
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, తన ఆటపై అభిమానుల ప్రేమ మాత్రం ఏమాత్రం…
ఈ సంవత్సరం ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ క్లాష్ గా ట్రేడ్ అభివర్ణిస్తున్న ఆగస్ట్ 14 జరిగే కూలీ వర్సెస్ వార్…
ఏపీ ప్రజలకు కూటమి సర్కారు మంగళవారం శుభవార్తను చెప్పింది. రాష్ట్రంలో ఉంటూ ఇప్పటిదాకా రేషన్ కార్డులు లేని కుటుంబాలకు కొత్తగా…
కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల వ్యవహారం.. అంతా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల కనుసన్నల్లోనే జరుగుతోంది. ఇది…