‘గ్రహణం’ చిత్రంతో అరంగేట్రంలోనే జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. తెలుగులో గొప్ప అభిరుచి ఉన్న, తెలుగుదనంతో సినిమాలు తీసే అతి కొద్దిమంది దర్శకుల్లో ఆయనొకరు. ఐతే కెరీర్లో ఇప్పటిదాకా చిన్న, మిడ్ రేంజ్ చిత్రాలే చేశాడు ఇంద్రగంటి. ఆయనకు కూడా పెద్ద స్టార్లతో భారీ చిత్రాలు తీయాలనే ఆశ ఉంది. ఆయన దగ్గర ‘జటాయు’ అనే ఒక భారీ కథ ఉంది. దీన్ని రెండొందల కోట్ల బడ్జెట్లో ఒక టాప్ స్టార్‌తో తీస్తారని గతంలో ప్రచారం జరిగింది. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడానికి కూడా ముందుకొచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు.
అన్నీ రెడీ అనుకున్నాక ఏం జరిగింది అన్నది అర్థం కాలేదు. తన కొత్త చిత్రం ‘సారంగపాణి జాతకం’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన ఇంద్రగంటి ‘జటాయు’ గురించి మాట్లాడారు. ‘‘సారంగపాణి కంటే ముందు ‘జటాయు’ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడానికి అంగీకరించారు. ఐతే కొన్ని రోజుల ట్రావెల్ చేసిన తర్వాత.. ఆయన నిర్మిస్తున్న ‘గేమ్ చేంజర్’ పూర్తి కావడానికి ఎక్కువ సమయం పడుతుందని తెలిసి మధ్యలో ఇంకో సినిమా చేసుకుని రండి అని రాజు గారు చెప్పారు. అప్పుడే శివలెంక కృష్ణ ప్రసాద్ గారితో ‘సారంగపాణి జాతకం’ మొదలుపెట్టాం.
‘జటాయు’ నా డ్రీమ్ ప్రాజెక్టు. ఆ చిత్రాన్ని ఎప్పటికైనా నేనే తెరకెక్కిస్తా. వేరొక దర్శకుడైతే నేను అనుకున్నట్లుగా ఆ సినిమాను తీయలేరు’’ అని ఇంద్రగంటి తెలిపారు. ఇక ‘సారంగపాణి జాతకం’లో జాతకాలు మంచివా, చెడ్డవా అనేమీ చెప్పలేదని.. నమ్మకాల్ని తాను ప్రశ్నించలేదని ఇంద్రగంటి తెలిపారు. తన జీవితంలోనూ జాతకం ప్రకారం చెప్పిన విషయాలు కొన్ని జరిగాయని, కొన్ని జరగలేదని.. జాతకాలపై నమ్మకాలనేవి ఎవరికి వాళ్లకి వ్యక్తిగత విషయాలని.. ఏ విషయమైనా పరిమితిలో ఉండాలని ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశానని ఇంద్రగంటి తెలిపారు. ‘సారంగపాణి జాతకం’ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on April 20, 2025 3:14 pm
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…