ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే తెలుగులో లైగర్ తో ఎంట్రీ ఇవ్వడం చూశాం. సినిమా డిజాస్టరే కానీ హీరోయిన్ గా అమ్మడి ఎక్స్ ప్రెషన్లు, నటన మీద చాలా కామెంట్సే వచ్చాయి. పీల దేహంతో అరువు తెచ్చినట్టున్న హావభావాలతో కనీస స్థాయిలో మెప్పించలేకపోయింది. ఏడేళ్ల క్రితం 2019 లో ఎంట్రీ ఇచ్చిన అనన్య ఇప్పటిదాకా కెరీర్ బెస్ట్ అని చెప్పుకోవడానికి ఏమి లేదు. బ్లాక్ బస్టర్ ఒక్కటీ పడలేదు. ఒకటి రెండు యావరేజ్ అయినా తనను గుర్తుపెట్టుకున్న వాళ్ళు తక్కువ. అందుకే నెపోటిజం మీద ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు ముందు వచ్చే పేర్లలో అనన్యది తప్పకుండా ఉంటుంది.
ఇన్ని సంవత్సరాల తర్వాత అనన్య పాండేకు చెప్పుకోదగ్గ పాత్ర కేసరి ఛాప్టర్ 2లో దొరికింది. అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్ ప్రధాన పాత్రల్లో స్వాతంత్ర సంగ్రామంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జలియన్ వాలా బాగ్ ఊచకోత బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు కరణ్ సింగ్ త్యాగి దీన్ని తెరకెక్కించారు. రివ్యూస్ చాలా పాజిటివ్ గా వచ్చాయి. పబ్లిక్ టాక్ పెరుగుతోంది. గంటకు కనీసం పది వేల టికెట్లు బుక్ మై షోలో అమ్ముడుపోతున్న సినిమా ప్రస్తుతానికి ఇది ఒక్కటే. ఇందులో అనన్య పాండే దిల్ రీత్ గిల్ గా చాలా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. గంపెడు సీనియర్ ఆర్టిస్టుల మధ్య ఇంత నటించడం గొప్పేనని చెప్పాలి.
తన మీద పడిన ముద్రని తొలగించుకోవడానికి అనన్య పాండేకు కేసరి 2 ఉపయోగపడేలా ఉంది. అవకాశాల కోసం వేచి చూస్తున్న టైంలో ఇది బ్రేక్ ఇవ్వడం ఖాయమని విశ్లేషకుల అంచనా. అక్షయ్ కుమార్ భార్యగా రెజీనా కెసెండ్రా లాంటి అనుభవజ్ఞులు చాలానే ఉన్నప్పటికీ అనన్య పాండే తనదైన ముద్ర వేయగలిగింది. సంవత్సరాల తరబడి సక్సెస్ కోసం మొహం వాచిపోయి ఉన్న అక్షయ్ కుమార్ కు కేసరి 2 రూపంలో హిట్టు పడేలా ఉంది. మరీ రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో కాకపోతే సూపర్ హిట్ అయితే ఖాయం. అంతకన్నా పెద్ద ఫలితం దక్కుతుందా లేదానేది ఇంకో వారం పది రోజుల్లో తేలనుంది.
This post was last modified on April 19, 2025 5:38 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…