Movie News

పుష్ప డూప్‌కి ఇంత క్రేజా?

సినిమా హీరోలను అభిమానులు ఏ స్థాయిలో ఆరాధిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు సినిమా హీరోల డూప్‌లను చూసి కూడా ఊగిపోయే రోజులు వచ్చేశాయి. గత కొన్నేళ్లలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఊపేసిన సినిమా అంటే ‘పుష్ప’నే. అందులో ప్రధాన పాత్రకు ఉత్తరాది జనం కూడా బాగా కనెక్ట్ అయిపోయారు. పుష్ప గెటప్, మేనరిజమ్స్, డైలాగ్స్ వాళ్లను ఒక ఊపు ఊపేశాయి. దీంతో అల్లు అర్జున్‌తో కొంచెం పోలికలు ఉన్న ఒక వ్యక్తి.. పుష్ప గెటప్‌ వేసుకుని అక్కడి జనాలను ఆకర్షించడం మొదలుపెట్టాడు.

ఐతే ఇలా సినిమా హీరోలు, క్రికెటర్లతో పోలికలు ఉన్న వ్యక్తులు వారి గెటప్స్ వేసుకుని ఎప్పుడో ఒకసారి సందడి చేయడం వరకు ఓకే. కానీ ఇలాంటి వ్యక్తులకు ఆ సెలబ్రెటీల స్థాయిలో ఆదరణ రావడం, వారిని చూస్తే జనం ఊగిపోవడమే విడ్డూరం. పుష్ప గెటప్‌తో పాపులరైన వ్యక్తి కొంత కాలంగా అనేక కార్యక్రమాలకు అతిథిగా హాజరవుతున్నాడు. రాజకీయ నాయకుల సభలకు అతిథిగా వెళ్తున్నాడు. అతను వస్తే జనం సినిమా హీరోను చూసినట్లే ఊగిపోతున్నారు.

తన ర్యాలీలు, సభలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు చూసి జనం షాకవుతున్నారు. ఒక సినిమా క్యారెక్టర్‌ను అనుకరిస్తే జనం ఇంత వేలం వెర్రిగా ఎగబడడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. ఇంకా పెద్ద విశేషం ఏంటంటే.. సదరు వ్యక్తి కొన్ని ప్రకటనల్లోనూ నటిస్తున్నాడు. కొన్ని బ్రాండ్స్ అతణ్ని ప్రచారకర్తగా మార్చుకున్నాయి. ఒక సంస్థ అతడితో ఒక యాడ్ కూడా షూట్ చేసింది. ఈ వ్యక్తి షాపింగ్ మాల్స్ ఆరంభోత్సవాలకు, టీవీ షోలకు సైతం అతిథిగా హాజరవుతుండడం విశేషం. తన డూప్‌ను అల్లు అర్జున్ సైతం బీహార్‌లో ప్రి రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లినపుడు కలిశాడు. దీంతో తన క్రేజ్ ఇంకా పెరిగిపోయింది.

This post was last modified on April 19, 2025 3:21 pm

Share

Recent Posts

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

16 minutes ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

38 minutes ago

అద్భుత ప్రయోగాల నిలయం ‘సింగీతం’

లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…

1 hour ago

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

4 hours ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

5 hours ago

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

12 hours ago