ఏ తల్లిదండ్రులకైనా తమ సంతానం పెళ్లి చేసుకుని.. వారికి పిల్లలు పుడితే వాళ్లతో ఆడుకుని ఆ తర్వాత తనువు చాలించాలని అనుకుంటారు. అందుకు సెలబ్రెటీలు కూడా మినహాయింపు కాదు. బాలీవుడ్ లెజెండరీ నటుడు రిషి కపూర్ కూడా అదే ఆశించాడు. పిల్లల సంగతేమో కానీ.. తన కొడుకు రణబీర్ కపూర్ పెళ్లి చూడాలనుకున్నారు.
ఐతే ఇంతకుముందు కత్రినా కైఫ్‌తో డీప్ లవ్‌లో ఉన్న అతను వ్యవహారాన్ని పెళ్లిదాకా తీసుకెళ్లి మధ్యలో డ్రాప్ అయిపోయాడు. కత్రినాను రణబీర్ పెళ్లి చేసుకోవడం పట్ల రిషికి పెద్దగా అభ్యంతరాలు లేవని.. కానీ ఆయన భార్య మాత్రం అభ్యంతర పెట్టిందని అప్పట్లో వార్తలొచ్చాయి. గర్ల్ ఫ్రెండ్స్‌ను మార్చడం అలవాటైన రణబీర్.. తర్వాత బ్రేక్ తీసుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత మహేష్ భట్ తనయురాలు ఆలియా భట్ ప్రేమలో పడ్డాడు. ముందు ఆలియానే అతణ్ని ఇష్టపడింది. తర్వాత రణబీర్ కూడా ఓకే అన్నాడు.
వీరి పెళ్లి గురించి రెండేళ్ల కిందట్నుంచే చర్చ జరుగుతోంది. వీరి పెళ్లి జరిపించాలని రిషి గట్టిగా కోరుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతాయి. కానీ ఇంతలోనే ఆయన ఎవ్వరూ ఊహించని విధంగా క్యాన్సర్ బారిన పడ్డారు. అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకుని ఇండియాకు తిరిగి వచ్చారు. ఆయన కోలుకున్నారనే అంతా అనుకున్నారు. తిరిగొచ్చాక ఆయన కొన్ని టీవీ షోల్లో పాల్గొన్నారు. మీడియతో కూడా మాట్లాడారు. కొంత నీరసంగా కనిపించినప్పటికీ రిషి సాధారణ స్థితికి వస్తాడనే అంతా అనుకున్నారు. కానీ ఎలాంటి సంకేతాలు ఇవ్వకుండా ఉన్నట్లుండి ఈ రోజు ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు.
రిషి కోలుకున్నాక పెళ్లి చేసుకుందామని రణబీర్ అనుకున్నాడో ఏమో తెలియదు కానీ.. ఆయనుండగా పెళ్లి కొడుకు కాలేదు. దీంతో కొడుకు పెళ్లి చూడాలన్న కోరిక తీరకుండానే రిషి వెళ్లిపోయాడు. నిన్నటి ఇర్ఫాన్ మరణాన్నే తట్టుకోలేకపోతుంటే రిషి సైతం ఇలా కాలం చేయడం సినీ అభిమానులకు కోలుకోలేని షాక్.
This post was last modified on April 30, 2020 3:48 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…