‘గ్రహణం’ లాంటి అవార్డ్ విన్నింగ్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన ఇంద్రగంటి మోహనకృష్ణ.. తనకంటూ ఒక అభిమాన వర్గాన్ని సంపాదించుకున్నారు. గొప్ప అభిరుచి ఉన్న దర్శకుడిగా ఆయనకు పేరుంది. కాకపోతే కెరీర్లో చాలా వరకు ఇంద్రగంటి చిన్న సినిమాలే చేశారు. ‘వి’ చిత్రంతో ఆయన రేంజ్ పెరుగుతుందని అనిపించింది. కానీ ఆ సినిమా నిరాశపరచడంతో మళ్లీ ముందులాగే చిన్న సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. వచ్చే వారం ఆయన కొత్త చిత్రం ‘సారంగపాణి జాతకం’ రాబోతోంది. దీని తర్వాతి ప్రాజెక్టు ఇంకా ఖరారు కాలేదు.
ఐతే ‘జటాయు’ పేరుతో ఇంద్రగంటి ఓ భారీ చిత్రం చేయాలని చాన్నాళ్లుగా అనుకుంటున్నారు. ప్రభాస్ హీరోగా ఈ సినిమా రూపొందుతుందనే వార్తలు వచ్చాయి. దిల్ రాజు ప్రొడక్షన్లో ఈ సినిమా చేయడానికి గతంలో ప్రయత్నాలు చేశారు ఇంద్రగంటి. తాజాగా ‘జటాయు’ గురించి ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ హీరోగా ఈ సినిమా చేయబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని స్పష్టం చేశారు. ‘జటాయు’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని.. ఆ సినిమాను భారీ స్థాయిలో తీయాలనే ఆలోచన ఉందని.. త్వరలోనే దాని గురించి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు ఇంద్రగంటి.
ఇక ఇటీవల ఓ డ్యాన్స్ షోలో ‘మాయా బజార్’లోని ‘అహనా పెళ్ళంట’ పాటకు పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ చేసిన అమ్మాయిని ఇంద్రగంటి అభినందించడం వివాదాస్పదమైంది. ఇలాంటి డ్యాన్సుల విషయంలో మందలించాల్సింది పోయి అభినందనేంటి అనే ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై ఇంద్రగంటి స్పందించారు. ఆ షోల్లో స్వేచ్ఛగా అభిప్రాయం చెప్పే అవకాశం ఉండదన్నారు. కొన్ని పరిమితుల మధ్య మాట్లాడాల్సి ఉంటుందని.. అందుకే ఆ డ్యాన్స్ గురించి విమర్శ చేయలేకపోయానని ఆయనన్నారు.
This post was last modified on April 17, 2025 1:50 pm
దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…
రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…
చెల్లెలికి బర్త్డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా! పాలిటిక్స్లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా…
సినిమాల్లో కంటెంట్ ఎలా ఉందన్న దాని కంటే.. ఆ సినిమా టీంలో ముఖ్యమైన వ్యక్తుల మాటతీరును, నడవడికను బట్టి కూడా సినిమాకు ఓపెనింగ్స్…
తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.…
అఖండ 2 తాండవంతో గత వారం గడిచిపోయాక ఇప్పుడు మూవ్ లవర్స్ చూపు కొత్త ఫ్రైడే మీదకు వెళ్తోంది. బాలయ్య…