అంటే సుందరానికితో టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ నజ్రియా మన పుష్ప విలన్ ఫహద్ ఫాసిల్ శ్రీమతన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ అనోన్య దాంపత్యానికి మారుపేరుగా ఉంటారు. అయితే గత కొంత కాలంగా నజ్రియా కనిపించడం తగ్గించేసింది. సూక్ష్మ దర్శిని విజయాన్ని షేర్ చేసుకోవడం కానీ, తన పుట్టినరోజుకు అందుబాటులో ఉండటం కానీ చేయలేదు. పోనీ కలిసేందుకు ప్రయత్నించిన దర్శక నిర్మాతలకు అందుబాటులోకి రాలేదు. ఏం జరిగిందా అని ఫ్యాన్స్ సతమతమవుతున్న టైంలో సోషల్ మీడియా పోస్టు ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. అందులోనూ కొన్ని ప్రశ్నలు మిగిలాయి. ముందు ఏముందో చూద్దాం.
“హలో అందరికీ. మీరంతా బాగున్నారని ఆశిస్తున్నాను. నేను కొన్ని నెలలుగా ఎందుకు అందుబాటులో లేనో చెప్పాలనిపించి ఇక్కడికి వచ్చాను. మీకు తెలుసు సినీ పరిశ్రమనే అద్భుత సమూహంలో భాగమైన నేను మానసిక మెరుగుదలతో పాటు వ్యక్తిగత కారణాల వల్ల మీ ముందు హాజరు చూపించుకోవడం కష్టంగా మారింది. నా 30వ పుట్టినరోజుతో పాటు సూక్ష్మదర్శిని విజయాన్ని సెలెబ్రేట్ చేసుకోలేకపోయాను. పూర్తిగా షట్ డౌన్ కావడం వల్ల కాల్స్ అటెండ్ చేయలేదు. మెసేజెస్ కు రిప్లై ఇవ్వలేదు. క్షమాపణ కోరుతున్నాను. బెస్ట్ యాక్టర్ గా కేరళ స్టేట్ అవార్డు అందుకున్నాను. చాలా కష్టంగా అనిపిస్తున్న ప్రయాణంలో నేను పూర్తిగా వెనక్కు రావడానికి ఇంకొంత సమయం పట్టేలా ఉంది. మీ అందరి ప్రేమాభిమానాలతో అతి త్వరలోనే రీ కనెక్ట్ అవుతాను. సెలవు”
చూశారుగా. సందేశం స్పష్టంగానే ఉన్నా అసలు ఎందుకు అంతర్ధానం అయ్యిందనేది నజ్రియా స్పష్టంగా పేర్కొనలేదు. భార్యా భర్తలు ఇద్దరూ ఆర్టిస్టులుగా చాలా బిజీగా ఉన్న టైంలో ఏదో జరగరానిది జరిగితే తప్ప ఇంత రియాక్షన్ ఉండదు. ఫహద్ ఫాసిల్ సైతం దీని గురించి ఎక్కడా మాట్లాడిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఆమెగా బయట చెప్పింది కానీ ఇకపై ఏదైనా తన సమాధానం ఆశించవచ్చు. ఎక్కడా నోట్ లో ఫహద్ గురించి నజ్రియా ప్రస్తావించలేదు కాబట్టి కుటుంబ పరంగా ఏ సమస్యా ఉండకపోవచ్చు. ఏది ఏమైనా నిజమైన కారణాలు బయటికి వస్తే తప్ప నజ్రియా ఇంత బ్రేక్ ఎందుకు తీసుకుందనేది సస్పెన్స్ గానే ఉంటుంది.
This post was last modified on April 17, 2025 8:53 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…