నందమూరి బాలకృష్ణ తన ప్రతి పుట్టిన రోజుకూ అభిమానులకు సినిమాల పరంగా కానుక ఇస్తుంటాడు. అప్పటికి నటిస్తున్న సినిమా నుంచి టీజర్ లాంటివి రిలీజ్ చేయడం.. అలాగే కొత్త చిత్రాలను ప్రకటించడం లాంటివి ప్లాన్ చేస్తుంటారు. ఈ ఏడాది జూన్ 10న బాలయ్య పుట్టిన రోజుకు రెండు కానుకలు రెడీ అవుతున్నట్లు సమాచారం. ముందు నుంచి అనుకుంటున్నట్లే తన కొత్త చిత్రం ‘అఖండ-2’ నుంచి టీజర్ ట్రీట్ ఉంటుంది. ఇప్పటికే ఈ చిత్రం రెండు షెడ్యూళ్లు చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పుడు కూడా షూట్ కొనసాగుతోంది. దర్శకుడు బోయపాటి ఇప్పటికే టీజర్ కాన్సెప్ట్ ఎలా ఉండాలో ఫిక్స్ చేశాడట.
ఇప్పట్నుంచే అందుకోసం విజువల్స్ తీసి పక్కన పెడుతున్నాడట. టీజర్ పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసేలా భారీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు బాలయ్య కొత్త సినిమాను పుట్టిన రోజు నాడు అనౌన్స్ చేయబోతున్నారట. నందమూరి హీరోకు ‘వీరసింహారెడ్డి’ రూపంలో సూపర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని మరోసారి ఆయనతో జట్టు కట్టబోతున్నాడు.
తాజాగా అతను ‘జాట్’తో బాలీవుడ్ హీరో సన్నీ డియోల్‌కు హిట్ ఇచ్చాడు. ఈ ఊపులో బాలయ్యతో మళ్లీ సినిమా చేయబోతున్నాడు. రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’తో టాలీవుడ్లోకి అడుగు పెడుతున్న వృద్ధి సినిమాస్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతోంది. మరో సంస్థ కూడా ఈ ప్రాజెక్టులో భాగం అవుతుందని సమాచారం. బాలయ్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో భారీగా ఈ సినిమాను నిర్మించబోతున్నారట. వచ్చే ఏడాది వేసవికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలున్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి కానీ.. అది కార్యరూపం దాల్చే అవకాశాలు లేవని తెలుస్తోంది.
This post was last modified on April 16, 2025 7:58 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…