ఏ రంగంలో అయినా సక్సెస్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. సినీ రంగంలో అయితే దానికి ప్రాధాన్యం మరీ ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ రేట్ చాలా తక్కువ మరి. ఇక్కడ సినీ జనాల వ్యక్తిగత సంబంధాలు, బంధాలు కూడా చాలా వరకు సక్సెస్ మీదే ఆధారపడుతుంటాయి. సక్సెస్‌ల్లో ఉన్న ఇద్దరు ప్రేమలో పడితే.. అందులో ఒకరు ఫెయిలవగానే దూరం కావడం జరుగుతుంటుంది.
ముఖ్యంగా ఒక అందమైన హీరోయిన్ ఫెయిల్యూర్లలో ఉన్న టెక్నీషియన్‌తో దీర్ఘ కాలం బంధంలో కొనసాగడం, అతడితోనే జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధం కావడం అంటే విశేషమే. మొదటి సినిమాతో కథానాయికగా పరిచయమై.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మెరిసిన పూనమ్ బజ్వా ఈ కోవకు చెందిన అమ్మాయే.
ఒకప్పుడు కెమెరామన్‌గా పని చేసి.. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఓం అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సునీల్ రెడ్డి గుర్తున్నాడా? ఈ సినిమాతో కళ్యాణ్ రామ్‌ను నిండా ముంచేశాడతను. యాక్షన్ సినిమాను సరైన అవగాహన లేకుండా త్రీడీలో తీసి కళ్యాణ్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చాడు. తర్వాత చాలా ఏళ్ల విరామం వచ్చింది. ఆపై సాయిధరమ్ తేజ్‌తో తిక్క లాంటి భారీ బడ్జెట్ మూవీ తీశాడు. అది కూడా పెద్ద డిజాస్టర్ అయింది. దీంతో అడ్రస్ లేకుండా పోయాడు సునీల్.
ఐతే తిక్క చేస్తున్నప్పటికే సునీల్, పూనమ్ ప్రేమలో ఉన్నారు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యాక సునీల్ కనిపించకుండా పోవడంతో పూనమ్ ఇక ఎంతో కాలం అతడితో కొనసాగదేమో అనుకున్నారు. కానీ ఆమె అతడితో బంధాన్ని కొనసాగిస్తోంది. అతణ్ని పెళ్లి కూడా చేసుకోబోతోంది. అతడితో కలిసున్న రొమాంటిక్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ లైఫ్ మేట్ అంటూ కామెంట్ కూడా పెట్టింది.
This post was last modified on November 2, 2020 3:36 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…