డైరెక్ట్ చేసినవి మూడే మూడు చిత్రాలు. కానీ నాగ్ అశ్విన్ రేంజే వేరు ఇప్పుడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన అతను.. రెండో చిత్రం ‘మహానటి’తో గొప్ప దర్శకుల జాబితాలో చేరిపోయాడు. ‘కల్కి’తో ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్లలో ఒకడనిపించుకున్నాడు. ఇప్పుడు నాగి అంటే ఒక బ్రాండ్. అలాంటి దర్శకుడు చెప్పే మాటలను ఎవ్వరైనా ఆసక్తిగా వింటారు. తాజాగా ఒక కాలేజీలో ఓ ఈవెంట్లో పాల్గొన్న నాగి.. అక్కడి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పాడు.
ఈ క్రమంలోనే మీరు ఏదైనా కథ రాస్తే.. అలాంటి కథే వేరే సినిమాలో కనిపిస్తే మీ ఫీలింగ్ ఎలా ఉంటుందని ప్రశ్నించాడు ఓ విద్యార్థి. ఈ ప్రశ్నకు ఆశ్చర్యకర సమాధానం ఇచ్చాడు నాగి. హాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్స్‌లో ఒకటనదగ్గ క్రిస్టఫర్ నోలన్ సినిమా ‘ఇన్సెప్షన్’తో తన కథకు పోలికలు కనిపించాయని నాగి చెప్పాడు. ‘ఇన్సెప్షన్’ రిలీజ్‌కు ముందే తాను అలాంటి ఒక కథ రాశానన్నాడు.
జ్ఞాపకాల మీద ఆ కథ సాగుతుందని.. ఐతే సేమ్ అదే కథ కాకపోయినా.. ఆ సినిమా చూసినపుడు తన ఐడియాతో చాలా సిమిలర్‌గా కనిపించిందని.. దీంతో ఒక వారం పాటు తాను డిప్రెషన్లోకి వెళ్లిపోయానని.. ఊరికే అలా తిరుగుతూ, మ్యాగీ తింటూ గడిపానని చెప్పాడు నాగి. ఇక వేరే సినిమా ఏదైనా డైరెక్ట్ చేసి ఉంటే బాగుండేదనే ఫీలింగ్ మీకుందా అని అడిగితే.. అలాంటిదేమీ లేదని చెప్పిన నాగి.. రెండు మూడు చిత్రాలను ఎడిట్ చేస్తే బాగుండేదని మాత్రం అనిపించిందన్నాడు. అందులో ముందుగా చెప్పిన పేరు.. ఖలేజా. ఆ సినిమాతో పాటు ‘డియర్ కామ్రేడ్’ సినిమాను కూడా తాను ఎడిట్ చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు నాగి. బహుశా ఎడిటింగ్ సరిగా లేకపోవడం వల్లే ఆ సినిమాలు ఫెయిలయ్యాయన్నది నాగి ఫీలింగ్ కావచ్చు.
This post was last modified on April 15, 2025 7:09 pm
విశ్వగురుగా…పేరు తెచ్చుకున్నప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పెహల్గామ్ ఉగ్రదాడి విషమ పరీక్ష పెడుతోందా? ప్రపంచ దేశాలకు శాంతి సందేశం అందిస్తున్న…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో రూపొందబోయే భారీ ఎంటర్ టైనర్ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది.…
గత ఏడాది కూటమి విజయం దక్కించుకున్నాక.. ముఖ్యంగా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించిన తర్వాత.. 'పిఠాపురం…
పెహల్గామ్ ఉదంతం తర్వాత పాకిస్థాన్ మీద తీవ్ర చర్యలకు నడుం బిగించిన కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ప్రజల నుంచి కూడా…
బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిర్లిప్తత నెలకొంది. చాలా థియేటర్ల దగ్గర స్మశాన వైరాగ్యం కనిపిస్తోంది. పట్టుమని పది మంది రాక…
గత ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలైన వైసీపీని చాలా మంది వదిలేశారు. కీలక రెడ్డి…